Kirak RP Chepala Pulusu: జబర్దస్త్ మాజీ కమెడియన్ కిరాక్ ఆర్పీ వ్యాపారస్తుడిగా మారిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆర్పీ కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్ ఓపెన్ చేశారు. రూ. 40 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రారంభించాడు. అనూహ్యంగా బిజినెస్ సక్సెస్ అయ్యింది. నెల రోజుల్లోనే తన పెట్టుబడి తిరిగి వచ్చేసిందని, లాభాలు మొదలయ్యంటూ స్వయంగా వెల్లడించారు. నగర శివార్లలో ఓ వంటశాల ఏర్పాటు చేసి నెల్లూరుకి చెందిన సిబ్బందితో వివిధ రకాల చేపల పులుసులు చేయిస్తున్నారు. కిరాక్ ఆర్పీ చేపల పులుసు వ్యాపారానికి డిమాండ్ పెరగడంతో అదనంగా సిబ్బందిని కూడా నియమించుకున్నాడు.

మణికొండతో పాటు హైదరాబాద్ లో పలు ఏరియాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచెస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా చెప్పాడు. కాగా కిరాక్ ఆర్పీ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొందరు కుట్రలు చేస్తున్నారట. కిరాక్ ఆర్పీ వ్యాపారాన్ని దెబ్బ తీసేందుకు ప్రణాళికలు వేస్తున్నారట. కొందరు పెయిడ్ బ్యాచ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాగోలేదంటూ దుష్ప్రచారం మొదలుపెట్టారట. ఈ విషయాన్ని కిరాక్ ఆర్పీ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నేను పెద్ద వంటశాల ఏర్పాటు చేసి చేయితిరిగిన వంటగాళ్లతో పలు రకాల చేపల పులుసులు తయారు చేయించి కస్టమర్స్ కి అందిస్తున్నాను. ఒకసారి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తిన్నవాళ్ళు పది మందిని తీసుకొస్తున్నారు. కస్టమర్స్ స్వయంగా తమ సన్నిహితులకు చెప్పి వ్యాపారం అభివృద్ధి చేస్తున్నారు. పులుసు రుచిగా లేకపోతే మరలారారు కదా. ఒక పెయిడ్ బ్యాచ్ తయారయ్యారు. సోషల్ మీడియాలో నా వ్యాపారం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నా వ్యాపారానికి ఏమీ కాదు.

వాళ్ళు చేసే దుష్ప్రచారం నా వ్యాపారానికి మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది… అని కిరాక్ ఆర్పీ విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన కిరాక్ ఆర్పీ ఆ షో వేదికగా ఫేమస్ అయ్యారు. జబర్దస్త్ వదిలేసిన అనంతరం డైరెక్టర్ గా ఓ మూవీ స్టార్ట్ చేశారు. ఆ చిత్రం అనుకోని కారణాలతో మధ్యలో ఆగిపోయింది. దాంతో కిరాక్ ఆర్పీ వ్యాపారబాట పట్టి సక్సెస్ అయ్యారు. తనతో పాటు పది మందికి పని దొరికేలా చేశారు. ఇక కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారం ఈ స్థాయికి వెళుతుందో చూడాలి.