Bigg Boss 6 Telugu : ‘టికెట్ 2 ఫినాలే’ శ్రీహాన్ పాలిట శాపంలా మారిందా..?

Bigg Boss 6 Telugu :  బిగ్ బాస్ సీజన్ 6 లో టాస్కులు దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరుకు..క్యాష్ ప్రైజ్ దగ్గర నుండి ఓటింగ్ వరుకు ప్రతి ఒక్కటి ఎవ్వరి ఊహలకు అందని విధంగా ముందుకు దూసుకుపోతుంది..ఇక ఈ సీజన్ లో కొన్ని టాస్కులు ఓడిపోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి..కొన్ని టాస్కులు గెలవడం వల్ల నష్టాలు ఉంటాయి అనే కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది..ఉదాహరణకి ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కుని తీసుకుందాం..కంటెస్టెంట్స్ అందరూ […]

Written By: NARESH, Updated On : December 7, 2022 7:55 pm
Follow us on

Bigg Boss 6 Telugu :  బిగ్ బాస్ సీజన్ 6 లో టాస్కులు దగ్గర నుండి ఎలిమినేషన్స్ వరుకు..క్యాష్ ప్రైజ్ దగ్గర నుండి ఓటింగ్ వరుకు ప్రతి ఒక్కటి ఎవ్వరి ఊహలకు అందని విధంగా ముందుకు దూసుకుపోతుంది..ఇక ఈ సీజన్ లో కొన్ని టాస్కులు ఓడిపోవడం వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి..కొన్ని టాస్కులు గెలవడం వల్ల నష్టాలు ఉంటాయి అనే కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది..ఉదాహరణకి ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కుని తీసుకుందాం..కంటెస్టెంట్స్ అందరూ అన్ని లెవెల్స్ ఆడిన తర్వాత చివరికి శ్రీహాన్ టాస్కుని గెలుపొంది..టికెట్ ని సాధించి టాప్ 5 లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ గా నిలిచాడు.

కానీ ఈ టికెట్ అతని బిగ్ బాస్ జర్నీ పాలిట శాపంలాగా మారుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి దాదాపుగా అన్నీ వారాల్లోనూ శ్రీహాన్ నామినేషన్స్ లో ఉంటూ వచ్చాడు.. ఓటింగ్ ప్రకారంగా అతను రెండు లేదా మూడో స్థానాల్లో కొనసాగుతూ ఉండేవాడు.

కానీ గత రెండు వారల నుండి ఆయన నామినేషన్స్ లోకి రాలేదు..ఈ వారం అతను ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు కాబట్టి నామినేట్ అవ్వలేదు..ఇది అతని ఓటింగ్ గ్రాఫ్ పై గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది..ఎందుకంటే గత రెండు మూడు వారాలుగా రోహిత్ ఓటింగ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది..అతని ఊపు చూస్తుంటే టైటిల్ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే విధంగా ఉంది..కానీ శ్రీహాన్ రెండు వారాలు నామినేషన్స్ లోకి రాకపోవడం తో అతని స్థానం మూడు నుండి నాల్గవ స్థానానికి పడిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

రెండవ స్థానం నుండి నాల్గొవ స్థానానికి పడిపోయాడు అంటే మాములు విషయం కాదు.. రాబోయే రోజుల్లో ఆయన టాప్ 5 వ స్థానానికే పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది.. మరి శ్రీహాన్ ఈ వారం హౌస్ లో తన ఆట తీరుతో గ్రాఫ్ ని పెంచుకొని టాప్ 5 స్థానాల్లో ఏ స్థానం లో నిలుస్తాడో చూడాలి.. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో అందరికంటే రేవంత్ కి అత్యధిక ఓట్లు వచ్చాయి.