Mahesh- Trivikram And Thaman: త్వరలో ఎస్ఎస్ఎంబీ 28 షూట్ తిరిగి మొదలుకానుండగా త్రివిక్రమ్, మహేష్, థమన్ ముంబై వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరితో పాటు మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్, దర్శకుడు మెహర్ రమేష్ సైతం జాయిన్ అయ్యారు. నమ్రత స్నేహితురాలు షాజియా గోవారికర్ నివాసంలో భేటీ అయ్యారు. షాజియా వీరందరికి లంచ్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రుచికరమైన హోమ్ మేడ్ ఫుడ్ తో విందు ఇచ్చినందుకు నమ్రత షాజియాకు కృతజ్ఞతలు తెలిపారు.

మహేష్-త్రివిక్రమ్ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా ముంబై వెళ్లారనే ఒక ప్రచారం జరుగుతుంది. అయితే వీరితో మెహర్ రమేష్ ఎందుకు జాయిన్ అయ్యారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ నుండి థమన్ ని తప్పించారంటూ పుకార్లు వినిపించాయి. వాటికి ఈ భేటీతో స్పష్టత వచ్చింది. జరిగిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. వీరి ముంబై ప్రయాణం కొత్త చిత్ర ప్రణాళికలో భాగమే అనేది సుస్పష్టం.
దాదాపు 12 ఏళ్ళ తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ సెట్ అయ్యింది. 2010 లో విడుదలైన ఖలేజా చిత్రం వీరిద్దరి చివరి చిత్రం. దీంతో ఫ్యాన్స్ సైతం ప్రాజెక్టు పట్ల విపరీతమైన ఆసక్తితో ఉన్నారు. హ్యాట్రిక్ కావడంతో భారీ హిట్ పడుతుందని భావిస్తున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ జరిపారు. అయితే స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేర్పులు చేశారని, పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో షూటింగ్ సరికొత్తగా స్టార్ట్ చేస్తారట.

2023 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. సెకండ్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఈ పాత్ర కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంచుకున్నారట. మరోవైపు మహేష్-రాజమౌళి చిత్రం సైతం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. మే లేదా జూన్ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రణాళికలు వేస్తున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజమౌళి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ తెరకెక్కనుంది. ఇది జంగిల్ అడ్వెంచర్ జోనర్లో ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.