https://oktelugu.com/

Thums Up Old Advertisement: ఇప్పుడంటే సో సో గాని.. ఒకప్పుడు థంబ్స్ ఆప్ ప్రకటనలు ఓ రేంజ్ లో ఉండేవి మరి.. వైరల్ వీడియో

సరిగ్గా రెండు దశాబ్దల క్రితం వెనక్కి వెళ్తే.. ప్రముఖ శీతల పానీయల సంస్థ థంబ్స్ అప్ వేసవికాలంలో తన మార్కెటింగ్ పెంచుకోవడానికి అనేక రకాల ప్రకటనలు ఇచ్చేది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 16, 2025 / 04:00 AM IST
    Thums Up Old Advertisement

    Thums Up Old Advertisement

    Follow us on

    Thums Up Old Advertisement: హీరోలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం.. ఏళ్ళ పాటు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకోవడం.. వారితో మానవతీత ప్రకటనలు రూపొందించడం.. ఇలానే సాగుతోంది ప్రముఖ శీతల పానీయ సంస్థ థంబ్స్ అప్ మార్కెటింగ్ స్ట్రాటజీ.. కానీ ఒకప్పుడు థంబ్స్ అప్ ఇలా ఉండేది కాదు..

    సరిగ్గా రెండు దశాబ్దల క్రితం వెనక్కి వెళ్తే.. ప్రముఖ శీతల పానీయల సంస్థ థంబ్స్ అప్ వేసవికాలంలో తన మార్కెటింగ్ పెంచుకోవడానికి అనేక రకాల ప్రకటనలు ఇచ్చేది. అందులో ప్రధానంగా క్రికెటర్ల జీవితాలకు సంబంధించిన చిన్నపాటి బుక్ లెట్ ను (ఆరోజుల్లో అదొక సాహసం) రూపొందించి.. కూల్ డ్రింక్ కొనుగోలు చేసిన వారికి దాన్ని ఉచితంగా ఇచ్చేది.. అందులో ప్లేయర్లు.. వారు సాధించిన రికార్డులను అందంగా పొందుపరిచేది. పైగా ఆ బుక్ లెట్ లను ఆయిల్ పేపర్ తో ప్రింట్ చేసేది. అవి సూక్ష్మ పరిమాణంలో ఉన్నప్పటికీ అద్భుతంగా కనిపించేవి.. క్రికెట్ అభిమానులు వాటిని అత్యంత జాగ్రత్తగా దాచుకునే వారంటే మామూలు విషయం కాదు. టైగర్ ఏదైనా స్నేహితుల మధ్య క్రికెట్ కు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు..ఆ బుక్ లెట్ లను చూసి వెంటనే చెప్పేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో సమాచార విప్లవం ఈ స్థాయిలో ఉండేది కాదు. పైగా ఫోన్లు ఈ స్థాయిలో వాడుకలో ఉండేవి కావు. దీంతో థంబ్స్ అప్ రూపొందించిన బుక్ లెట్ లే క్రికెట్ వికీపీడియాలుగా ఉండేవి. క్రికెట్ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాళ్ల జీవిత చరిత్రలకు సంబంధించిన బుక్ లెట్ లను అత్యంత జాగ్రత్తగా దాచుకునే వారంటే వాటికి ఏ స్థాయిలో విలువ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. కేవలం క్రికెటర్ల బుక్ లెట్ ల కోసమే థమ్స్ అప్ కొనుగోలు చేసేవారంటే అతిశయోక్తి కాదు.

    ఇలా వెలుగులోకి

    ఇన్ స్టా గ్రామ్ లో KHODIYAR KRUPA BOOK CENTRE అనే ఐడీలో నాటి కాలం నాటి క్రికెటర్ల బుక్ లెట్ ల కు సంబంధించిన ఓ వీడియో రీల్ రూపంలో దర్శనం ఇచ్చింది. అది కాస్త వేలాది వీక్షణలు సొంతం చేసుకుంది. ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజన్లు రెండు దశాబ్దాల క్రితం నాటి కాలంలోకి వెళ్లిపోయారు. ఒక్కసారిగా నాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. ” ఆ కాలం ఎంత గొప్పది. నేడు అన్ని కళ్ళ ముందు ఉన్న పెద్దగా తృప్తి అనిపించడం లేదు. కానీ నాడు అన్ని గొప్పగా ఉండేవి. టెక్నాలజీకి మనిషి ఇంత దారుణంగా బానిస కాలేదు. మనుషులు చక్కగా మాట్లాడుకునేవారు. బంధాలు, బంధుత్వాలు బలంగా ఉండేవి. మనుషుల్లో శ్రమ ఎక్కువగా ఉండేది. తద్వారా రోగాలు ఎక్కువగా ఉండేవి కావు. ఇప్పుడు సుఖాలు పెరిగాయి. అదే సమయంలో రోగాలు కూడా పెరిగాయి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మధ్య సాగుతోంది. ఇలాంటి వీడియోలు కనిపించినప్పుడు నాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కళ్ళ నుంచి కన్నీళ్లు జాలు వారుతున్నాయి. గత కాలం నయం వచ్చు కాలం కంటే అని అందుకే అంటారేమో నని. ఏది ఏమైనా ఇలాంటి వీడియో ద్వారా గతకాలాన్ని కళ్ళ ముందు ఉంచారు. గత జ్ఞాపకాన్ని పచ్చిగా కదలాడే విధంగా చేశారు. ఆ వీడియో చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది. గొప్ప కాలంలో ఉన్నట్టు.. గొప్ప జ్ఞాపకాలను దాచుకున్నట్టు.. గొప్ప అనుభూతులను భద్రపరచుకున్నట్టు ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.