Thug Life Trailer Review: కమల్ హాసన్(Kamal Hassan), మణిరత్నం(Maniratnam) కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ఎవరికీ మాత్రం ఆసక్తి ఉండదు మీరే చెప్పండి?..గతంలో ఈ కాంబినేషన్ సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్ళ కాంబినేషన్ లో ‘థగ్ లైఫ్'(Thug Life) అనే చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు, యంగ్ హీరో శింబు(Silambarasan TR) కూడా కీలక పాత్ర పోషించాడు. ఇందులో వీళ్లిద్దరు తండ్రీ కొడుకులుగా నటించినట్టు ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతుంది.
Also Read: రజినీకాంత్ తో ‘పుష్ప 2’ మేకర్స్..డైరెక్టర్ ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!
ట్రైలర్ లో అడుగడుగునా మణిరత్నం మార్క్ కనిపిస్తుంది. ట్రైలర్ ప్రారంభం లో ‘నువ్వు నా ప్రాణం కాపాడినోడివి..యముడికి దొరక్కుండా వెనక్కి లాగినోడివి..నీ తల రాత, నా తలరాత ఒకే మాదిరిగా రాసినాడు. ఇక నుండి మన ఇద్దరం చివరి వరకు కలిసి ప్రయాణిద్దాం’ అంటూ కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్ విన్న తర్వాత వీళ్లిద్దరు తండ్రి కొడుకులే, కానీ రక్త సంబంధం లేదు. ఎదో ఒక ఆపరేషన్ లో కమల్ హాసన్ కి శింబు దొరికి ఉంటాడు, అప్పటి నుండి వీళ్లిద్దరు తండ్రీకొడుకులు లాగా కలిసి జీవిస్తారు అనేది తెలుస్తుంది. ఇద్దరు క్యారెక్టర్స్ నెగటివ్ అని అర్థం అయ్యింది. చీకటి సామ్రాజ్యాన్ని కమల్ హాసన్ లోపల ఉంటూ అన్నీ చూసుకుంటుంటే, శింబు మాత్రం బయట కార్యక్రమాలను చూసుకుంటూ ఉంటాడు. అయితే శింబు కి ఈ చీకటి సామ్రాజ్యానికి నేనే అధిపతి గా ఉండాలి అనే కోరిక పుడుతుంది.
ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏర్పడే ఘర్షణే ఈ చిత్రం. చివరికి తండ్రి గెలుస్తాడా, లేదా కొడుకు గెలుస్తాడా అనేది ఆసక్తికరమైన అంశంగా ఈ ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇది రొటీన్ లైన్ అనొచ్చు. ఈ లైన్ మీద ఇప్పటి వరకు వందల కొద్దీ సినిమాలు వచ్చాయి. తెలుగు లో పవన్ కళ్యాణ్ బాలు, పంజా సినిమాలు కూడా ఇంచుమించు ఇదే లైన్ మీద తెరకెక్కాయి. కానీ డైరెక్టర్ టేకింగ్ లో నైపుణ్యత చూపిస్తే, కచ్చితంగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటించింది. గతంలో త్రిష శింబు తో కలిసి ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ లో నటించింది. ఇప్పుడు అదే త్రిష ఇందులో శింబు కి తల్లి పాత్రలో కనిపించడం గమనించాల్సిన విషయం, చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మేరకు క్లిక్ అవుతుంది అనేది. జూన్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
