Homeఎంటర్టైన్మెంట్India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా టీంలోకి ఆ ఇద్దరు.. 3వ టెస్టులో ఓడించడం...

India vs Australia 3rd Test: ఆస్ట్రేలియా టీంలోకి ఆ ఇద్దరు.. 3వ టెస్టులో ఓడించడం కష్టమే!

India vs Australia 3rd Test
India vs Australia 3rd Test

India vs Australia 3rd Test: భారత పర్యటనలో ఆస్ట్రేలియాకు ఇప్పటి వరకు నిరాశే మిలిగింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా చేతిలో ఆసీప్‌ చిత్తుగా ఓడింది. రెండు మ్యాచ్‌లో కేవలం మూడు రోజుల్లోనే ముగిశాయి. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్స్‌ భారత స్పిన్నర్లకు దాసోహం అవుతున్నారు. దీంతో మిగిలిన రెండు టెస్టుల్లోనూ ఓడించి.. వైట్‌వాష్‌ చేయాలని భారత జట్టు చూస్తోంది. కానీ.. ఆసీస్‌ తరఫున మూడో టెస్ట్‌ ఆడేందుకు ఆ ఇద్దరు ఆటగాళ్లు రెడీ కావడంతో భారత్‌కు గెలుపు అంత సులువు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆసీస్‌కు వైట్‌వాష్‌ తప్పదా?
బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా టీమిండియా తొలి రెండు టెస్టుల్లో గెలిచి ట్రోఫీని ఆస్ట్రేలియాకు దక్కకుండా చేసింది. ఇక మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియాను ఆస్ట్రేలియా ఏ విధంగా ఎదుర్కోనుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది క్రికెట్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు సైతం ఆస్ట్రేలియాకు భారత్‌ చేతిలో వైట్‌వాష్‌ తప్పదని జోస్యం చెప్పేస్తున్నారు. కానీ.. క్రికెట్‌ ప్రపంచాన్ని రారాజులా ఏలిన జట్టు అంత ఈజీగా తలవంచుతుందా? అనే అనుమానం కూడా ఉంది. ఏకంగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌కు గురైందంటే.. వారికి అంతకుమించిన అవమానం మరొకటి ఉండదు.

ఆటగాళ్లకు గాయాలు..
సిరీస్‌ ఆరంభానికి ముందు ఆ జట్టు స్టార్‌ పేసర్లు జోష్‌ హెజల్‌వుడ్, మిచెల్‌ స్టార్క్‌ లాంటి ఆటగాళ్లు గాయాలబారిన పడి తొలి రెండు మ్యాచ్‌లకు దూరం అయ్యారు. తాజా సమాచారం ప్రకారం హెజల్‌వుడ్‌ మిగిలిన రెండు టెస్టులకు సైతం పూర్తిగా దూరం అయినట్లు తెలుస్తోంది. అలాగే రెండో టెస్టు సందర్భంగా గాయపడిన స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం చివరి రెండు టెస్టులకు దూరం అయినట్లు సమాచారం. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సైతం తన వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. మళ్లీ తిరిగి మూడో టెస్టు వరకు జట్టుతో చేరాతాడా లేదా అనేది అనుమానమే. ఇన్ని ప్రతికూలత మధ్య ఆస్ట్రేలియా తమ పరువు ఎలా కాపాడుకుంటుందో అని ఆసీస్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ వర్రీ అవుతున్నారు. కానీ.. ఆస్ట్రేలియా జట్టుకు బూస్ట్‌ ఇచ్చేందుకు, మూడో టెస్టులో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సానుకూలమైన విషయం ఒకటి జరిగింది.

India vs Australia 3rd Test
India vs Australia 3rd Test

ఆ ఇద్దరి రాకతో..
తొలి రెండు టెస్టులు ఓడి పరువు కోసం ఆడే చివరి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా బలోపేతం చేసేందుకు కామెరున్‌ గ్రీన్, మిచెల్‌ స్టార్క్‌ మూడో టెస్టు మ్యాచ్‌ ఆడనున్నట్లు సమాచారం. గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమైన ఈ ఆటగాళ్లు ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో ఇండోర్‌ వేదికగా జరిగే మూడో టెస్టుతో పాటు, చివరి టెస్టులోనూ వీరిద్దరూ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. గ్రీన్, స్టార్క్‌ రాకతో ఆసీస్‌ కాస్త బలపడిందనే చెప్పాలి. బౌలింగ్‌ విభాగంలో స్టార్క్‌ ఉండటంతో ఆసీస్‌కు ఎంతో కీలకం. పిచ్‌ ఎంత స్పీన్‌కు అనుకూలించినా స్టార్క్‌ తన వేగంతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అలాగే కామెరున్‌ గ్రీన్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొగలడు. వీరిద్దరూ జట్టులో ఉంటే మూడో టెస్టులో ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు అంత సులువు కాదంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మరి మూడో మ్యాచ్‌లో ఆసీస్‌ పోరాడుతుందా.. మొదటి రెండు మ్యాచ్‌లలాగే.. చేతులు ఎత్తేస్తుందో చూడాలి.

 

ఎజెండా సెట్ చేసిందెవరు? అమలు చేస్తుందెవరు? || Analysis on ABN Radhakrishna Comments on Pawan Kalyan

 

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version