Assam: ప్రస్తుతం చదువుకునే రోజులు పోయాయి.. చుదువు కొనే రోజులు వచ్చాయి. విద్యారంగంలోకి వ్యాపారులు ప్రవేశించి విద్యను వ్యాపారం చేసేశారు. రెండేళ్లు నిండిన పిల్లలను కూడా స్కూళ్లలో చేర్పించుకుని ప్లేస్కూల్, డిజిటల్ స్కూల్, ఐఐటీ స్కూల్ అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో 1వ తరగతికే 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో అయితే లక్ష రూపాయలకు పైనే ఫీజు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న లక్ష్యంతో పెద్దపెద్ద స్కూళ్లలో ఎక్కువ ఫీజులు పెట్టి చదవిస్తున్నారు. కానీ, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే స్కూల్ లక్షలు వసూలు చేసే స్కూల్ కన్నా చాలా గొప్పది. అయితే ఫీజు విషయంలో కాదు.. రెండు లక్ష్యలను ఎంచుకుని పనిచేస్తున్న ఈ స్కూల్ కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలనే ఫీజుగా తీసుకుని పిల్లలు, పెద్దలకు చదువు చెబుతోంది. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడుంది. వారు తీసుకుంటున్న ప్లాస్టిక్ వేస్ట్‌ను ఏం చేస్తారు. వారు ఎంచుకున్న రెండు లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాం.
అక్షరాస్యత పెంపు.. ప్లాస్టిక్ తగ్గింపు..
అసోంలో మాజిమ్, పరిమిత్ దంపతులు దేశంలో పెరుగుతున్న ప్లాస్టిక్, నిరక్షరాస్యతను తగ్గించడమే లక్ష్యంగా పాఠశాలను ప్రారంభించారు. ఈ రెండింటికి అనుబంధంగా ఉండేలా ఫీజు నిబంధన ప్రవేశపెట్టారు. అన్ని స్కూళ్ల తరహాలో ఇక్కడ ఫీజుగా డబ్బులు తీసుకోరు. కేవలం ప్లాస్టిక్ వేస్ట్‌ను మాత్రమే పిల్లల నుంచి ఫీజుగా తీసుకుంటారు. ప్రతీ వారంలో కేజీ ప్లాస్టిక్ వేస్ట్‌ను పిల్లలు స్కూల్‌కు తీసుకురావాలి. తమ ఇళ్ల నుంచి లేదా వీధుల నుంచి 25 ప్లాస్టిక్ బాటిళ్లను ఫీజుగా చెల్లించాలి.
వేస్ట్ అంతా రీ యూజ్..
ఇక మాజిమ్, పరిమిత్ ఇలా సేకరించిన వేస్టుతో పిల్లలతోపాటు, నిరక్ష్యరాస్యులైన వృద్ధులకు కూడా చదువు చెబుతున్నారు. అయితే వాళ్లు తెచ్చిన ప్లాస్టిక్ వేస్తును అంతా రీసైకిల్ చేసి రీయూస్ చేసుకునేలా తయారు చేస్తున్నారు. వాతితో ఫ్లవర్ పాట్స్, టాప్ బౌల్స్, జ్వువెల్లరీ, బ్రిక్స్, టాయిలెట్స్, రోడ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. వాటితో వచ్చే డబ్బులతోనే పిల్లలకు అవసరమైన సదుపాయాలు సమకూర్చడంతోపాటు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించి చదువు చెప్పిస్తున్నారు.
క్రియేటివ్ ఇన్షియేటివ్..
ఇక మాజిమ్, పరిమిత్ అక్షరాస్యత పెంపు, ప్లాస్టిక్ తగ్గింపు కోసమే ఇలాంటి క్రియేటివ్ ఇన్షియేటివ్ తీసుకున్నారు. అసోంలో ఈ పాఠశాల విజయవంతం కావడంతో తమ తర్వాతి లక్ష్యం ఇండియా అంతా చేయాలని భావిస్తున్నారు. తాము తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గుతాయని, నిరక్షరాస్యత కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో దేశమంతా తమ పాఠశాలలను విస్తరిస్తామంటున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This school in assam does not charge money as fees but instead takes plastic bottles to teach children
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com