https://oktelugu.com/

Viral: మరణించిన 20 ఏళ్ళ తర్వాత కొడుకు కలలో కనిపించిన తండ్రి…అతని సమాధి తవ్వి చూసి ఒక్కసారిగా అందరు షాక్…

కలలో కనిపించిన తండ్రి తన సమాధి దుస్థితి బాగాలేదని చెప్తూ బాగు చేయమని వేడుకున్నాడు. ఇలాంటి కల అతనికి రెండు మూడు సార్లు వచ్చింది. ఆ కొడుకు మనసు కలచి వేయడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు.

Written By:
  • Mahi
  • , Updated On : January 16, 2025 / 02:32 PM IST

    Viral(1)

    Follow us on

    Viral: తమకు ఇష్టమైన వాళ్లను లేదా కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వాళ్లకు జీవితాంతం ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడో చనిపోయిన తల్లిదండ్రులు కలలో కనిపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో జరిగింది. చనిపోయిన 20 ఏళ్ల తర్వాత తండ్రి తన కొడుకు కలలో కనిపించాడు. కలలో కనిపించిన తండ్రి తన సమాధి దుస్థితి బాగాలేదని చెప్తూ బాగు చేయమని వేడుకున్నాడు. ఇలాంటి కల అతనికి రెండు మూడు సార్లు వచ్చింది. ఆ కొడుకు మనసు కలచి వేయడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్ళందరూ ఒప్పుకోవడంతో సమాధి తవ్వి చూడగా అక్కడ కనిపించిన సీన్ చూసి ఆ ఊరి వారంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశంబి జిల్లాలోని ధారానగర్లో 2023లో అక్టోబర్ లో జరిగింది. మౌలానా అన్సర్ అహ్మద్ 20 ఏళ్ల క్రితం చనిపోయాడు. అతను 20 ఏళ్ల తర్వాత తన కొడుకు అఖ్తర్ సుభాని కలలో కనిపించాడు. తన సమాధి పాడైపోయిందని, నీళ్లు మట్టి లోపలికి వస్తున్నాయని దాన్ని బాగు చేయమని కొడుకును వేడుకున్నాడు. ఒకరోజు ఉదయం అఖ్తర్ లేచిన వెంటనే తన కుటుంబ సభ్యులకు ఈ విషయం గురించి చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఊరి చివర ఉన్న స్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ చూస్తే నిజంగానే మౌలానా అన్సర్ సమాధి శిథిలావస్థకు చేరుకొని ఉంది. ఈ విషయం గురించి ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ బరేల్వి వర్గానికి చెందిన ఒక మత పెద్దను సంప్రదించారు. ఆయన సమాధిని బాగు చేయవచ్చు అని చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ ఆ పనిలో పడ్డారు.

    అక్కడ వాళ్ళందరూ సమాధి తవ్వుతున్న సమయంలో ఊరి వారందరూ వచ్చారు. అలా తవ్వుతున్న సమయంలో ఒక ఊహించని దృశ్యం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. 20 ఏళ్లు గడిచినా కూడా మౌలానా ఆన్సర్ అహ్మద్ మృతదేహం ఏ మాత్రం చెక్కుచెదరకుండా కులిపోకుండా అలాగే ఉంది. క్షణాల్లో ఈ విషయం మొత్తం అక్కడ చుట్టుపక్కలంతా పాకిపోయింది. దాంతో ఈ అద్భుతాన్ని చూసేందుకు తండోపతండాలుగా ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మౌలానా ఆన్సర్ కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని శుభ్రం చేసి మళ్లీ భక్తిశ్రద్ధలతో ఖననం చేశారు. సమాధిని మరింత బలంగా నిర్మించారు. సాధారణంగా అయితే ఇన్నేళ్ల తర్వాత మృతదేహం కుళ్ళిపోతుంది. కానీ మౌలానా ఆన్సర్ అహ్మద్ మృతదేహం చెక్కుచెదరకుండా అలాగే ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ఊరంతా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

    ఇది దేవుడి మహిమ అంటూ కొంతమంది అలాగే అద్భుతం అంటూ మరికొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతదేహం కుళ్ళిపోకుండా లేదా మట్టిలో కలిసిపోకుండా ఉండడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు అని చెప్తున్నారు. సాధారణంగా అయితే మరణించిన తర్వాత బ్యాక్టీరియా, శిలీంద్రాల వల్ల మనిషి శరీరం కుళ్ళిపోతుంది. కానీ కొన్ని కొన్ని సార్లు పర్యావరణ పరిస్థితులు, ఆ వ్యక్తి శరీరం, ఆ వ్యక్తిని ఖననం చేసిన విధానం వంటి అనేక కారణాలవల్ల ఈ ప్రక్రియ నెమ్మది కావచ్చు లేదా ఆగిపోవచ్చు అని చెప్తున్నారు.