
Samantha – Naga Chaitanya: సౌత్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైతన్య జంట కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే.మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపించే ఈ జంట ఇలా విడిపోవడం కేవలం అభిమానులకు మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా ఎంతో బాధని కలిగించింది.అప్పుడే వీళ్లిద్దరు విడిపోయి ఏడాది దాటిపోయింది.
విడిపోయిన తర్వాత ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉన్నారు.సమంత ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరోపక్క తనకి వచ్చిన మయోసిటిస్ వ్యాధి కి చికిత్స తీసుకుంటుంది.నాగచైతన్య వరుసగా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటున్నాడు.త్వరలోనే ఆయన ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని రెండవ వివాహం కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇదంతా పక్కన పెడితే సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే విషయం పై సోషల్ మీడియా లో ఇదివరకు వందల్లో కథనాలు వచ్చి ఉంటాయి.వాటిల్లో ఏది నిజమో ఏది అబద్దమో తెలియదు.
కానీ వీళ్లిద్దరు విడిపోవడానికి అసలు కారణం ఇన్నేళ్లకు బయటపడింది అంటూ లేటెస్ట్ గా ఒక కథనం జోరుగా ప్రచారం సాగుతుంది.సమంత వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అయ్యే అమ్మాయి.ఆమె ఆలోచనలు మొత్తం చాలా బిన్నంగా ఉంటాయి, షూటింగ్ లేని సమయం లో ఆమె ఎక్కువ విదేశాలకు హాలిడే ట్రిప్స్ వెయ్యడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.కొన్ని కొన్ని సార్లు ఒంటరిగా వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.కానీ నాగ చైతన్య అందుకు పూర్తిగా బిన్నం.ఆయనకీ ఇల్లే ప్రపంచం, సినిమాలు లేని సమయం లో ఇంట్లో వంటలు చేసుకోవడం, పుస్తకాలూ చదవడం నాగచైతన్య హాబీ.ఈ విషయాలలోనే వీళ్లిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవట.అంతే కాదు నాగచైతన్య కి బోల్డ్ సన్నివేశాల్లో సమంత నటించడం అసలు ఇష్టం ఉండేది కాదట.

ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఆమె నటించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలు నాగ చైతన్య కి చిరాకు తెప్పించాయి.ఆ సిరీస్ తర్వాత ఆమెకి బాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి.రిజెక్ట్ చెయ్యమని నాగ చైతన్య అడిగేవాడట, అందుకు సమంత ఒప్పుకోలేదు.ఈ విషయం కూడా అప్పట్లో పెద్ద గొడవ గా మారిందట.అలా చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారి వీళ్లిద్దరు విడిపోయినట్టు తెలుస్తుంది.