Pawan Kalyan Love Story: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరపై, రాజకీయాల్లో చాలా మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. పవర్ స్టార్ అంటే ఇప్పుడు ఒక పవర్ జనరేటర్ అని అందరూ కీర్తిస్తుంటారు. జనసేనాని రాజకీయాల్లోనూ వాడి వేడి రగిలిస్తూ కాకరేపుతున్నారు. సినిమాలైనా.. రాజకీయాలైనా పవన్ దిగనంతవరకే అన్నట్టుగా ప్రస్తుతం తయారైంది.

పవన్ సినీ, రాజకీయాల జీవితాలు ఇలా ఉన్నా.. ఆయన వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు మాత్రం ఉన్నాయి. ఆటుపోట్లతో సాగింది. పవన్ స్టార్ హీరో కాకముందు నందిని అనే వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సినిమాల్లోకి వచ్చాక స్టార్ అయిన పవన్ తో నందినికి విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత ‘బద్రి’సినిమా చేసే సమయంలో హీరోయిన్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడి ఆమెతో సహజీవనం చేసి 2009 ఎన్నికల సమయంలో పవన్ పెళ్లి చేసుకున్నాడు.
Also Read: Acharya Disaster: ఆచార్య అపజయానికి కారణాలేంటి?
ఇక ఆ తర్వాత రేణుదేశాయ్ కు విడాకులు ఇచ్చి రష్యన్ గర్ల్, తీన్మార్ హీరోయిన్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డల తండ్రిగా పవన్ అయ్యాడు. ప్రస్తుతం ఈమెతోనే దాంపత్య జీవితం గడుపుతున్నాడు. అయితే తాజాగా బద్రి సినిమా సమయంలో జరిగిన ఒక నిజాన్ని బయటపెట్టాడు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ. ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి.
రేణుదేశాయ్ నిజానికి ఒక మోడల్ అని.. ఆమెను దర్శకుడు గీతాకృష్ణనే తొలుత సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం చేయాల్సి ఉందట. కానీ గీతాకృష్ణ సినిమా ఆలస్యం కావడంతో రేణుదేశాయ్ నాడు ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చి జేమ్స్ బాండ్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. గీతాకృష్ణ సినిమా ఆగిపోయింది. ఈక్రమంలోనే బద్రి సినిమాలో రేణు దేశాయ్ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది.. షూటింగ్ టైంలోనే పవన్ తో ప్రేమలో పడడం .. ఆ తర్వాత కథ అంతా అందరికీ తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ నిజానికి బద్రి సినిమా టైంలో రేణు దేశాయ్ కంటే ముందు అమీషా పటేల్ నే ఎక్కువగా ప్రేమించాడని గీతాకృష్ణ సంచలన కామెంట్స్ చేశాడు. అమీషా కూడా ఆ టైంలో పవన్ స్టార్ డం , క్రేజ్ చూసి పడిపోయిందట.. అచ్చం సినిమాల్లోని కథ మాదిరిగానే రేణు దేశాయ్, అమీషా పటేల్ ఇద్దరూ పవన్ తో నాడు ప్రేమలో ఉన్నారట.. అమీషా పటేల్ తో పవన్ చెట్టాపట్టాలేసుకొని తిరిగారని.. నాడు టాలీవుడ్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని గుసగుసలు వినిపించాయని గీతాకృష్ణ తెలిపారు.
కట్ చేస్తే ‘బద్రి’ అయిపోయాక రేణుదేశాయ్ తోనే ప్రేమలో పడి సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా అయ్యాడు పవన్ కళ్యాణ్. ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత అమీషా పటేల్ పెళ్లి కూడా చేసుకోకుండా 40 ఏళ్లు వచ్చినా బాలీవుడ్ లో ఒంటరిగానే మిగిలిపోయింది. ఆ మిస్టరీ ఇప్పటీకీ తేలలేదు.
Also Read:Chiranjeevi Missed Basha Movie: బాషా సినిమాని చిరంజీవి మిస్ అవ్వడానికి కారణం ఎవ్వరో తెలుసా..?
Recommended Videos:



[…] Also Read: Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్ జీవితంలో దాచేస… […]
[…] Also Read: Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్ జీవితంలో దాచేస… […]