
Oscar On Natu Natu Song: సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని ఆర్ ఆర్ ఆర్ అందుకుంది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఈ చిత్రంలోని నాటునాటు పాటకు అవార్డ్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది.
మీసం మెలేసిన ట్రిపుల్ ఆర్ టీం..
ఆస్కార్ గెలుచుకున్న నాటు నాటు పాటకు అవార్డు రావడం టీం విజయంగా దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ పాటను చంద్రబోస్ రచించారు. తెలంగాణ పదాలతో ఈ పాట మొత్తం సాగుతుంది. ఇక ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. పాట కైగట్టిన తీరు కూడా అవార్డు రావడంతో కీలకమనే చెప్పాలి. పాట రాయడం, కైగట్టడం ఒక ఎత్తు అయితే పాటను పాడడం మరో ఎత్తు. ప్రతీ తెలుగువాడు పాడుకునేలా ఎంఎం. కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇదే ఈ పాటకు మరో హైలెట్‌గా చెప్పవచ్చు. ఇక ఈ పాట గురించి చెప్పుకోవాల్సిన మరో విశేషం కొరియోగ్రఫీ. ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు రావడానికి మరో కారణం స్టెప్పులే. ఈ పాటకు ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇక ఈ పాటకు ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. తనదైన శైలిలో ప్రత్యేకంగా స్పెషల్ లొకేషన్ కోసం ఉక్రెయిన్‌లో ఈ పాటను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. తెలుగు పాటకు అందరూ స్టెప్పులు వేసేలా ఈ పాటను రూపొందించారు. ఇక ఈ పాటలో చెప్పుకోవాల్సిన మరో విశేషం కాస్ట్యూమ్. ఈ పాటకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా దర్శకుడు రాజమౌళి సతీమణి రమ పనిచేశారు. వినూత్నంగా, విభినంగా ఉండేలా రూపొందించిన కాస్ట్యూమ్ కూడా అవార్డుకు మరో కారణంగా చెప్పొచ్చు.

అదరగొట్టిన రామ్‌చరణ్, ఎన్టీఆర్..
ఇక నాటునాటు పాటకు పదాలు రాయడం, సంగీత అందించడం, కొరియోగ్రఫీ చేయడం, దర్శకత్వం హించడం, కాస్ట్యూమ్ డిజైన్ చేయడం అన్నీ ఒక ఎత్తు అయితే ఆ పాటకు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. అదిపోయే స్టెప్పులు వేయడం మరో ఎత్తు, రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్, కాస్ట్యూమ్ డిజైనర్, దర్శకుడు.. వీరంతా తెరవెనుక ఉన్నవారు. వీరంతా ఒక ఎత్తు అయితే.. తెరపై స్టెప్పులు వేసి ప్రపంచాన్ని స్టెప్పులు వేయించేలా చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్ మరో ఎత్తు అని చెప్పకోవాలి.
#RRRMovie composer M. M. Keeravani accepts the original song #Oscar for “Naatu Naatu” and graces the audience with a tune of his own. https://t.co/hxuR41IpLt pic.twitter.com/t4pbTwAE1M
— Los Angeles Times (@latimes) March 13, 2023