Anand Mahindra- Natu Natu Song: నాటు నాటు సాంగ్ దేశ సరిహద్దులు దాటేసింది. ఆస్కార్ విన్నింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ కి క్రేజ్ దక్కింది. సామాన్యులే కాకుండా ప్రముఖులు, సెలెబ్రిటీలు కూడా నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు. భారత పతాకాన్ని ప్రపంచ సినిమా వేదికపై రెపరెపలాడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఇండియన్స్ ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను ఈ సాంగ్ ఎంతగానో ఆకర్షించింది. అలాగే ఆస్కార్ విజయాన్ని ఆయన ఆస్వాదించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ మేకర్స్ కీర్తిని కొనియాడుతూ పలు ట్వీట్స్ వేశారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ మహిళ పప్పెట్ తో నాటు నాటు సాంగ్ కి స్టెప్స్ వేయించారు. తోలుబొమ్మలాట తరహాలో ఉన్న ఈ ఆర్ట్ ద్వారా నాటు నాటు సాంగ్ పర్ఫార్మ్ చేసిన ఆమె ప్రతిభను, నాటు నాటు సాంగ్ క్రేజ్ తెలిసేలా ఆయన ట్వీట్ చేశారు. తన ట్వీట్లో… నాటు నాటు సాంగ్ మీద ఇదే నా చివరి ట్వీట్. ఈ ఒక్కటి పోస్ట్ చేయకుండా ఉండలేకపోయాను. నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో, ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పేందుకు ఇది ఉదాహరణ, అని కామెంట్ చేశారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ గా మారింది. కాగా నాటు నాటు సాంగ్ కి కొరియన్ ఎంబసీ స్టాఫ్ డాన్స్ చేసి వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. ఢిల్లీ వేదికగా జర్మనీ అంబాసిడర్ తన స్టాఫ్ తో పాటు నాటు నాటు సాంగ్ పెర్ఫార్మ్ చేశారు. అమెరికాలో ప్రవాస భారతీయులు వందల కార్లు పార్క్ చేసి నాటు నాటు సాంగ్ కి లైట్స్ సింక్ చేస్తూ ఓ స్పెషల్ షో చేశారు. నార్వే దేశానికి చెందిన ఓ డాన్స్ గ్రూప్ తమదైన స్టెప్స్ వేశారు.
చెప్పుకుంటూ పోతే నాటు నాటు సంచలనాలు అనేకం ఉన్నాయి. ఒక తెలుగు సాంగ్ ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోవడం విశేషం. ఇక నాటు నాటు సాంగ్ కోసం రాజమౌళి అండ్ టీమ్ బాగానే కష్టపడ్డారు. ఉక్రెయిన్ దేశంలో యుద్ధం మొదలు కావడానికి కొన్ని నెలల ముందు ఈ సాంగ్ షూట్ చేశారు. దాదాపు నెల రోజుల సమయం తీసుకుంది. ప్రాక్టీస్ చేయడానికే రెండు వారాల సమయం పట్టింది. ఈ సాంగ్ ఇంతటి ప్రాచుర్యం పొందడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ కారణం.
https://twitter.com/anandmahindra/status/1638556203604398080?t=1KRs8IT8y9O8M_Cq3oVV0g&s=08