
Helicopter for Dham devotees : కేదార్ నాథ్ ధామ్ భక్తులకు ఐఆర్ టీ సీ శుభవార్త చెప్పింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్ నాథ్ ధామ్ ఎంతో ప్రశస్తి పొందింది. చుట్టూ పర్వత శిఖరాలు, ఉప్పొంగే జలసిరులతో కఠినమైన వాతావణం కలిగి ఉంటే కేదార్ నాథ్ ధామ్ యాత్ర భక్తులకు ఒక సవాలే.. అయితే వీరికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. కేదార్ నాథ్ ధామ్ భక్తులకు హెలీ కాప్టర్ సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ముందుకు వచ్చింది. ఇక ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవనున్న నేపథ్యంలో యాత్ర ప్రారంభమవుతుంది. కేదార్ నాథ్ ధామ్ యాత్ర మాత్రం ఏప్రిల్ 25న ప్రారంభమవుతుంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటుంది.. ఈ పవిత్రమైన యాత్రలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా భారీగా వస్తుంటారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారిక అంచనాల ప్రకారం ఈ యాత్రకు లక్షల్లో భక్తులు వస్తుంటారని ఒక అంచనా.
ఇప్పటికే ఈ యాత్రలో పాల్గొనేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు.. అయితే ఈ యాత్రలో అత్యంత కఠినమైనది కేదార్ నాథ్ ధామ్ దర్శనం.. ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. పైగా ఇక్కడి కొండల పైకి ఎక్కడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హరి ముఖ్యంగా చివరి 18 కిలోమీటర్ల ప్రయాణం భక్తులకు ఒక సవాల్. ఈ భక్తుల్లో చిన్నారులు, వృద్ధులు కూడా ఉంటారు. అయినప్పటికీ పరమశివున్ని దర్శించుకోవాలనే తలంపు తో వారు దేనినీ లెక్కచేయరు. అయితే ఇలాంటి అప్పుడు అపశృతులు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వారికి ఐఆర్ సీటీసీ హెలికాప్టర్ సేవల్ని భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. కేదార్ నాథ్ ధామ్ వెళ్లే భక్తులు హెలికాప్టర్ సేవల్ని ఐఆర్ సీటీసీ అధికారిక వెబ్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా https:// heliyatra.irctc.co.in/ అనే వెబ్ సైట్ ను రూపొందించింది. ఏప్రిల్ ఒకటి నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయని సంస్థ పేర్కొన్నది.. మార్చి 31 వరకు హెలీ కాప్టర్ కు సంబంధించిన ట్రయల్ రన్స్ పూర్తవుతాయి. ఆ తర్వాత బుకింగ్స్ మొదలు పెడతారు.. యాత్రికుల భద్రత కోసం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మార్గదర్శకాల ప్రకారం హెలికాప్టర్ ఆపరేటర్లు పనిచేస్తారు.
ఐఆర్ సీటీసీ హెలికాప్టర్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముందుగా ఒక పని చేయాల్సి ఉంటుంది. వారు టూరిస్ట్ కేర్ ఉత్తరాఖండ్ యాప్, స్టేట్ టూరిజం డెవలప్మెంట్ వాట్సాప్ సర్వీసులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.. దీనికోసం పర్యటకులు yatra అని టైప్ 918394833833 నెంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అన్ని వివరాలు అందులో పొందు పరచాల్సి ఉంటుంది.. చార్ ధామ్ యాత్రకు ఇప్పటివరకు 5.97 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు..ఇందులో కేదార్ నాథ్ కు 2.2 లక్షలు, గంగోత్రి కి 87,352 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.

2022లో 45 లక్షల మంది భక్తులు ఈ నాలుగు ఆలయాలను దర్శించుకున్నారు. అందులో 17.6 లక్షల మంది బద్రీనాథ్, 15.6 లక్షల మంది కేదారినాథ్, 6.2 లక్షల మంది గంగోత్రి, 4.8 లక్షల మంది యమునోత్రిని దర్శించుకున్నారు. ఈసారి ఇంతకుమించి భక్తులు వస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.. ఐఆర్ టీ సీ హెలికాప్టర్ సేవలు మాత్రమే కాకుండా చార్ ధామ్ ప్యాకేజీలు కూడా అమలు తీసుకొచ్చింది.. న్యూఢిల్లీ, హరి ద్వార్, ముంబై, రాయ్ పూర్ నుంచి ఈ టూర్ ప్యాకేజీలను అమలు చేస్తుంది.. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర 55,000.. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న భక్తులు 11 రోజులపాటు ఛార్ ధామ్ యాత్రకు వెళ్ళొచ్చు.