
Strong Dog: విశ్వాసానికి మారుపేరు శునకం. యజమాని కోసం తన ప్రాణాలనైనా అడ్డుపెట్టి ఈ జంతువు పోరాడుతుంది. అందుకే చాలా మంది కుక్కలపై విపరీతమైన ప్రేమను పెంచుకుంటారు. మనుషుల్లాగే వాటిని ట్రీట్ చేస్తూ అవసరమైన పుడ్ ను అందిస్తారు. యజమాని వాటిపై చూపిన ప్రేమకు ప్రతిఫలంగా అవి కూడా ఎంతో విశ్వాసంతో మెదులుతాయి. సాధారణంగా ఏ వ్యక్తి అయినా తన పెంపుడు కుక్క కోసం రోజూవారి ఆహారంతో పాటు ప్రత్యేక రోజుల్లో మాంసం పెడుతూ ఉంటారు. కానీ ఓ కుక్క కోసం ఒకాయన రోజూ 10 కిలోల మాంసం పెడుతున్నాడట. ఇంత మాంసం తిన్న అది ఎంత విశ్వాసం ఉండాలి? అంతకంటే ఎక్కువగా ఉంటుందని దానిని పెంచుకునే యజమాని అంటున్నాడు. ఇంతకీ ఆ కుక్క విశేషాలేంటో తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి పెంచుకునే ఆ కుక్క పేరు డాగ్ అర్జెంటీనా. 2 పులులు కలిస్తే ఎంత పవర్ ఉంటుందో అంతకు మించి దీనికి బలం ఉంటుందని ఆ వ్యక్తి చెబుతున్నారు. అలాగే ఒక ట్రాక్టర్ కు తాళ్లు కట్టి ఆ తాడును ఆ డాగ్ కు ఇస్తే పళ్లతో లాగుతుందని అంటున్నారు. పెంచుకునే వారిని, తెలిసిన వాళ్లను తప్ప మిగతా వారిపై ఏమాత్రం కనికరం లేకుండా ఈ కుక్క దాడి చేయడానికి అస్సలు వెనుకాడదని ఆయన చెబుతున్నారు.
డైరీ ఫాం పెంచుకున్న ఆయనకు వందల కొద్దీ గేదెలు, ఆవులు ఉన్నాయి. అయితే వీటికి దొంగల బెడద తీవ్రంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆవులను దొంగించినవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి డేంజరస్ కుక్కలను పెంచినట్లు చెబుతున్నారు. ఒకసారి డైరీలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడితే ఆయన చెయిని మొత్తం కట్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. వారు పెంచుకునే డాగ్స్ కు దొంగల స్మెల్ ఇట్టే తెలిసిపోతుందట. అందుకే ఇక్కడికి దొంగలు రావడానికి జంకుతారని చెబుతున్నారు.

సెక్యూరిటీ కోసం ఇలాంటి జంతువులను పెంచుకోవడం తప్పనిసరి అని ఆయన అంటున్నారు. అయితే ఇంత డేంజరస్ కుక్కలు మిగతా చోట్ల ఉన్నవో లేవో తెలియవు గానీ.. మేం పెంచుకునే శునకాలు మాత్రం 365 రోజులు బోనులోనే ఉంటాయని అన్నారు. అయితే ఒకసారి డోర్ ఓపెన్ చేస్తే మనిషి ప్రాణాలు తీయడానికైనా వెనుకాడవని అంటున్నారు. దీంతో ఈ కుక్క గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇక్కడుంది. మీరూ చూసేయండి.