
Photo Story: ఆయన తెలుగు రాష్ట్రాల్లో డైనమిక్ లీడర్.. తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు.. సభలు, సమావేశాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ పర్సన్.. పంచ్ డైలాగ్ లతో.. కోటేషన్స్ తో ప్రజలను ఆకట్టుకునే అతడే త్వరలో సీఎం అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇంతలో ఆయనకు సంబంధించిన ఓ చిన్ననాటి ఫొటో సోషల్ మీడియాలోకి వైరల్ అవుతోంది. ఆ యువనేత తన ఖాతాలో ఈ పిక్ ను పోస్టు చేసి.. అప్పట్లో ఇలా ఉండేవాడిని.. అంటూ క్యాప్షన్ పెట్టడం అందరినీ ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని వారంతా ఈ పిక్ ను చూసి రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతకీ ఎవరాయన.
ఇటీవల చాలా మంది సినీ ప్రముఖులు తమ చిన్న నాటి ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాలో చైల్డీష్ పిక్స్ ను షేర్ చేస్తున్నారు. ఎప్పుడూ రాజకీయ కామెంట్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇలా ప్రజలను ఆకట్టుకునే విధంగా విభిన్న ఫొటోలను పెడుతున్నారు. లేటేస్టుగా ఈ పొలిటికల్ లీడర్ చిన్ననాటి ఫొటో చూసి అబ్బాయి ఎంతో క్యూట్ గా ఉన్నారంటున్నారు. తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఈయనే అంటూ చర్చించుకుంటున్నారు.

ఇప్పటికైనా ఆయన ఎవరో గుర్తు పట్టారా? లేకపోతే తెలుసుకోండి. ఆయన ఎవరో కాదు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు. ఓ వైపు మంత్రి గా కొనసాగుతున్న కేటీఆర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తారు. ప్రతిపక్షాల విమర్శలపై ఘాటుగా సమాధానం చెబుతారు. బయట సభలు, సమావేశాల్లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకునే ఆయన సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడంతో నెట్ వాడే వాళ్లంతా కేటీఆర్ ను ఫాలో అవుతున్నారు.
కేటీఆర్ ఇప్పటి వరకు తనకు సంబంధించిన ఫొటోలను చాలా వరకు షేర్ చేశారు. కానీ లేటేస్ట్ పిక్ మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. ముద్దులొలికే విధంగా ఉన్న ఈ బాబు ఇప్పటికీ అంతే క్యూట్ గా ఉన్నారంటూ కొందరు కామెంట్స్ పెట్టడం విశేషం. అయితే కొందరి కామెంట్లకు కేటీఆర్ లైక్ కొట్టడం చూడొచ్చు. దీనిని భట్టి అర్థమైందేంటంటే.. ఆయన అందరితో కలుగొలుపుగా ఉంటారని కొందరు అంటున్నారు.