Ustaad Bhagat Singh: ప్రతి హీరో కెరీర్ లో అరుదైన చిత్రాలు కొన్ని ఉంటాయి. పవన్ ఫిల్మోగ్రఫీలో గబ్బర్ సింగ్ కి ప్రత్యేక స్థానం ఉంది. జల్సా తర్వాత పవన్ నటించిన పులి, తీన్ మార్, పంజా చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధంలో ఉన్న పవన్ కి యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దబంగ్ రీమేక్ సూచించారు. అప్పటికి హరీష్ శంకర్ చేసింది రెండు సినిమాలే. షాక్ డిజాస్టర్ కాగా మిరపకాయ్ సూపర్ హిట్. యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించే పవన్ హరీష్ తో మూవీ చేసేందుకు సై అన్నారు.

ఫస్ట్ లుక్ తోనే ఫ్యాన్స్ లో బీభత్సమైన హైప్ క్రియేట్ చేశారు. రఫ్ అండ్ రూత్ లెస్ పోలీస్ గెటప్ అదిరిపోయింది. యూనిఫామ్ షర్ట్ బటన్స్ తీసేది, మెడలో ఎర్ర కండువా వేసుకొని పవన్ సరికొత్తగా దర్శనం ఇచ్చారు. మాస్ పోలీస్ గెటప్ పవన్ కి చక్కగా కుదిరింది. ఇక ప్రోమోలు ఆ అంచనాలు ఆకాశానికి చేర్చాయి. 11 మే 2012 సమ్మర్ కానుకగా విడుదలైన గబ్బర్ సింగ్ ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. ఒరిజినల్ కి పొంతన లేకుండా స్ట్రెయిట్ మూవీ మాదిరి పవన్ ఇమేజ్ కి సెట్ అయ్యేలా హరీష్ రూపొందించారు.
పవన్ మేనరిజం, ఎలివేషన్స్ గూస్ బంప్స్ కలిగించాయి. ఒక హరీష్ రాసిన వన్ లైనర్స్ ఆటం బాంబుల్లా పేలాయి. ‘కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు’, ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా’ ,’నాకు తిక్కుంది దానికో లెక్కుంది’ ఎవర్ గ్రీన్ పంచ్ డైలాగ్స్ గా నిలిచిపోయాయి. అనేక టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన గబ్బర్ సింగ్ కాంబోలో మూవీ రావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అది ఎట్టకేలకు సాకారమైంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పవన్-హరీష్ చేతులు కలిపారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ పవన్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందా? థియేటర్స్ లోకి వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తో పదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ ఇచ్చిన హైప్, ఫీల్ హరీష్ ఇస్తారని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. పవన్ అభిమానిగా హరీష్ కి ఆయన్ని వెండితెరపై ఎలా చూపించాలో తెలుసని నమ్ముతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కి మించిన మూవీ అవుతుందని భావిస్తున్నారు.