Viral Video: ఆ బుడతడి వయసు మహా అయితే మూడు సంవత్సరాలు ఉంటాయి కావచ్చు. బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. వచ్చిరాని పదాలు మాట్లాడుకుంటూ సందడి చేయాల్సిన ఆ బాలుడు.. క్రికెట్ బ్యాట్ పట్టాడు. మైదానంలోకి దిగి చెలరేగి ఆడాడు. ప్రొఫెషనల్ బ్యాటర్ ను మించిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే స్టాండ్స్లోకి కొట్టాడు. నెటిజన్లు కామెంట్లు చేస్తున్న దాని ప్రకారం అతడు ఆస్ట్రేలియా దేశాన్ని చెందిన బాలుడు అని తెలుస్తోంది..ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి కార్య నిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా లైక్ చేశారు. Hugo maverick health అనే ఐడీ లో ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. సరదాగా బ్యాట్ పట్టిన ఆ బాలుడు వీర విహారం చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే కసితీరా బాదాడు. ప్రొపెషనల్ బ్యాటర్ లాగా మైదానంలో రకరకాల విన్యాసాలు చేశాడు. అతడి బ్యాటింగ్ తీరుకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ వ్యూస్ నమోదు చేసింది. 9.41 లక్షల మంది వీడియోను లైక్ చేశారు. 8,661 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
“చూడబోతే అతడు జూనియర్ డేవిడ్ వార్నర్ లాగా ఉన్నాడు. చిన్న వయసులోనే అతడికి శిక్షణ ఇస్తున్నారు. అతడేమో కసితీరా బ్యాటింగ్ చేస్తున్నాడు. వచ్చిన బంతిని వచ్చినట్టే స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. అతని ఆట ఇలానే ఉంటే అన్ని వరల్డ్ కప్ లు ఆస్ట్రేలియా సొంతమవుతాయి.” కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. ” రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి 16 మిస్డ్ కాల్స్ వచ్చాయి. ముంబై ఇండియన్స్ నుంచి వంద మిస్డ్ కాల్స్ వచ్చాయి. త్వరగా కిట్ రెడీ చేసుకో. ఐపీఎల్ లో ఆడుదువు గాని అంటూ” మరి కొంతమంది కామెంట్లు చేశారు.”బుడ్డోడా నీ బ్యాటింగ్ అదిరింది. ఆస్ట్రేలియా ఫ్యూచర్ నీ చేతిలో ఉందంటూ” ఇంకొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram