Viral Video : సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు ఓ హోటల్లోకి వచ్చారు. వారు ఒకరికి తెలియకుండా మరొకరు హోటల్లోకి ప్రవేశించారు. వారు అవతలి వ్యక్తి భార్యలతో వేర్వేరుగా హోటల్ లోకి వచ్చారని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఈ రెండు జంటలు పరస్పరం తారస పడ్డాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ముందుగా ఒక జంట ఆ గది ద్వారం బయట తమ చెప్పులను విడిచి లోపలికి వెళ్లారు. ఇక రెండవ జంట అక్కడికి వచ్చేసరికి అక్కడ గది వెలుపల ఉన్న చెప్పలు కనిపించాయి. ఆ చెప్పులను మరో మహిళతో జంటగా వచ్చిన వ్యక్తి గమనించాడు. ఆ తర్వాత అతడిలో అనుమానం మొదలైంది. దీంతో చెప్పులు విడిచి ఉన్న గది తలుపులను తట్టాడు. దీంతో మరో మహిళతో అందులో ఉన్న వ్యక్తి తలుపు తీశాడు. ఆ గదిలో ఓ మహిళ కనిపించడం.. అవతలి వ్యక్తితో వచ్చిన మహిళ తన భార్య అని ఇవతలి వ్యక్తి గుర్తించాడు. దీంతో ఆ సన్నివేశం ఒక్కసారిగా ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ కథ ఇలా సాగుతుండగానే ఆ వ్యక్తితో వచ్చిన మహిళ తలుపు తెరిచి గది నుంచి బయటికి వస్తుంది. ఆమెను చూసిన రెండవ వ్యక్తి తన భార్యగా నిర్ధారించుకుంటాడు.. ఆ తర్వాత ఆ ఇద్దరు పురుషులు ఒకరి భార్యలతో హోటల్ లోకి వచ్చినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. అయితే ఈ స్టోరీ మొత్తం కల్పితమే. కాకపోతే చూడ్డానికి అత్యంత కామెడీగా ఉంది. ఇది సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియో చూస్తుంటే కడుపుబ్బ నవ్వొస్తుంది. కేవలం కామెడీ కోసమే దీనిని రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ఇదే విషయాన్ని నెటిజన్లు కూడా అంచనా వేశారు.. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇదంతా చేస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.. ఇటీవల కాలంలో ఈ వీడియో విపరీతంగా సర్కులేట్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అవుతోంది. కాకపోతే ఫ్యామిలీ టైప్ వాళ్లకు ఈ వీడియో నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒకరి భార్యలతో మరొకరు హోటళ్లకు రావడం అనే కాన్సెప్ట్ కాస్త ఇబ్బందికరంగా ఉంది.
ఇలాంటివి రూపొందించొద్దు
ఈ వీడియో పట్ల కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది చూడ్డానికి కామెడీ లాగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ టైప్ నెటిజన్లకు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరి భార్యలతో కలిసి మరొకరు హోటల్స్ వెళ్లడం.. పరస్పరం తారసపడటం ఇబ్బందికరంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యూస్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తు కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.. వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో మాత్రం చూడడానికి నవ్వు తెప్పిస్తున్నప్పటికీ.. లోతుగా ఆలోచిస్తే ద్వంద్వార్ధాలు గోచరిస్తాయని వివరిస్తున్నారు.