Photo Story
Photo Story: సోషల్ మీడియాలో ఇటీవల కొందరు స్టార్ హీరోల చైల్డిష్ ఫొటోలు సందడి చేస్తున్నారు. వీరి బర్త్ డే సందర్భంగా వాటిని బయటకు తీస్తూ నెట్టింట్లో పోస్టు చేస్తున్నారు. అప్పటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఎవరో చెప్పండి? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. లేటేస్టుగా క్యూట్ గా ఉన్న ఇద్దరు బుడ్డొళ్ల ఫొటో ఒకటి ఆకట్టుకుంటోంది. అమాయకంగా.. అన్నదమ్ముల్లా.. కలిసి ఉన్న ఈ ఫొటో ఉన్న ఇద్దరూ ఇప్పుడు స్టార్ హీరోలుగా మారారు.అంతేకాకుండా మీరనుకుంటున్నట్లు వారిద్దరూ సోదరులే. వీరిలో ఒకరు తమ చిన్ననాటి ఫొటో అంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశారు. మరి వీనే ఎవరో చెప్పుకోండి?
గుర్తుపట్టకపోతే మేమే చెబుతాం. వీరిద్దరిలో ఒకరు సూర్య, మరొకరు కార్తీ. తమిళంతో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. సూర్య విషయానికొస్తే 1997లో తమిళం ‘నెరుక్కు నెర్’ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 40కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ‘శివపుత్రుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తరువాత గజిని సినిమాతో స్టార్ అయ్యారు. ఇక యముడు, సింగం సినిమాలో సూర్య రెండు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు. నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలకు సూర్య నిర్మాతగా కూడా ఉన్నారు.
Surya, Karti
కార్తీ ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు అవకాశాలు తలుపు తట్టాయి. ఆ తరువాత చెలియా, శకుని, ఖైదీ సినిమాలతో గుర్తింపుత తెచ్చుకున్నాడు. ఈ హీరో నేరుగా నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇండస్ట్రీ ఏదైనా హిట్టు మనదే అన్నట్లుగా కార్తీకి అన్ని వైపు లా కలిసి వస్తోంది. దీంతో స్టార్ హీరోగా మారిపోయాడు.
లేటేస్టుగా ఈ యంగ్ హీరో కార్తీ తన ఇన్ స్ట్రాగ్రాం లో తన అన్నతో కలిసున్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇద్దరు క్యూట్ గా ఉన్న ఈ ఫొటోను తన బర్త్ డే సందర్భంగా గుర్తు చేసుకుంటూ మెసేజ్ పెట్టాడు. ఈ ఫొటోకు చాలా మంది లైక్స్ కొడుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ అదే క్యూట్ గా ఉన్నారంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.