Super Star Krishna- Pawan Kalyan: సూపర్ స్టార్ కృష్ణ సినిమాల పరంగా కానీ..రాజకీయ పరంగా కానీ చాలా అప్డేట్ గా ఉంటారు..80 ఏళ్ళ వయస్సు వచ్చినా కానీ..ప్రస్తుత ట్రెండ్ ఎలా నడుస్తుందో క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగల అద్భుతమైన అనుభవం అతని సొంతం..అందుకే కృష్ణ కి ఇండస్ట్రీ లో ఉన్న పెద్దలందరూ అంతలా గౌరవిస్తారు..తెలుగు సినిమా ఇండస్ట్రీ నేడు దర్శక ధీరుడు రాజమౌళి ఎలా అయితే విలువైన ఆభరణం లాగ నిలిచాడో..ఆరోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ అలా నిలిచాడు.

అలాంటి మహోన్నత శిఖరం ఇటీవల కాలం లోనే నేలకొరగడం యావత్తు సినీ పరిశ్రమకి తీరని లోటు..నేడు ఇండస్ట్రీ లో ఎంతోమంది సూపర్ స్టార్స్ ఉండొచ్చు..భవిష్యత్తులో కూడా రావొచ్చు..కానీ కృష్ణ లాంటి సూపర్ స్టార్ మళ్ళీ పుట్టడు అని అభిమానులు మాత్రమే కాదు..ప్రతీ తెలుగోడు గర్వం గా చెప్పుకోవచ్చు..అయితే ఆయన చనిపోయిన తర్వాత కుడి భుజం లాంటి మనిషి, కృష్ణ సోదరుడు ఇటీవలే ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ముఖ్యంగా ఆయన చనిపొయ్యే ముందు రోజు తన సోదరుడితో సుమారు గంటన్నరసేపు భేటీ అయ్యారు..ఈ భేటీ లో కృష్ణ ప్రస్తుతం నడుస్తున్న సినిమాల ట్రెండ్ మరియు రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడట..ఆయన మాట్లాడుతూ ‘కృష్ణ గారితో ముందు రోజు కూడా నేను చాలాసేపు సరదాగా మాట్లాడాను..ప్రస్తుత సినిమాల గురించి రాజకీయాల గురించి కూడా చాలా మాట్లాడాడు..ప్రస్తుతం సినిమాలు టీజర్ బాగుంటేనే ఆడుతున్నాయి..టీజర్ బాగాలేకపోతే ఆడడం లేదు..ఎంత పెద్ద సినిమాని అయిన టీజర్ నిర్ణయిస్తుంది ఇప్పుడు..టీజర్ బాగుంటే సినిమా బాగాలేకపోయిన ఆడియన్స్ చూసేస్తున్నారు..ఎందుకంటే ఆడియన్స్ టీజర్ ని చూసి ఫిక్స్ అయ్యిపోతున్నారు చూడాలా వద్దా అని అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు ఆది శేషగిరి రావు.

ఇక రాజకీయాల గురించి కూడా కృష్ణ మాట్లాడాడు అంట..దానికి గురించి ఆదిశేషు మాట్లాడుతూ ‘ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ క్యాడర్ లో పిరికితనం ఎక్కువ అయిపోయింది..ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడే కదా క్యాష్ చేసుకోవాలి..కానీ టీడీపీ క్యాష్ చేసుకోవడం లేదు..ఎంతసేపు పవన్ కళ్యాణ్ కోసమే ఎదురు చూస్తున్నారు’ అని కృష్ణ చెప్పాడట..ఆది శేషు మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.