
Shivratri Movies: ప్రతీ శివరాత్రికి మన రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను స్పెషల్ షోస్ గా వేసుకుంటూ రావడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది.ఈ ఏడాది కూడా శివరాత్రికి పలు ప్రాంతాలలో స్పెషల్ షోస్ పడ్డాయి.పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు ,ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ సినిమాలు ఈసారి ఎక్కువగా పడ్డాయి.
ముఖ్యంగా శివరాత్రికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈసారి టెంపర్, దూకుడు, అఖండ , వాల్తేరు వీరయ్య మరియు రెబెల్ వంటి సినిమాలు పడ్డాయి. వీటిల్లో టెంపర్ సినిమాకి ఎన్టీఆర్ అభిమానులు బలమైన ఆల్ టైం రికార్డును నెలకొల్పారు.మూడు థియేటర్స్ లో 12 గంటల ఆటలను ప్రదర్శింపబడిన ఈ చిత్రానికి దాదాపుగా 3 కోట్ల 95 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.
అయితే ఇప్పటి వరకు ప్రతీ ఏడాది ప్రదర్శితమైన శివరాత్రి షోస్ అన్నిటిని కలుపుకుంటే టెంపర్ ఆల్ టైం రికార్డుని నెలకొల్పి టాప్ 1 స్థానం లో నిలబడగా, టాప్ 2 స్థానం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం నిలిచింది.ఈ సినిమాకి దాదాపుగా మూడు లక్షల 72 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇక మూడవ స్థానం లో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ దాదాపుగా ఒక లక్ష 92 వేల రూపాయిలను వసూలు చేసింది.

ఆ తర్వాత నాల్గవ స్థానం లో సూపర్ స్టార్ మహేష్ బాబు దూకుడు చిత్రం ఒక లక్ష 47 వేల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యగా, నందమూరి బాలకృష్ణ అఖండ చిత్రం లక్ష 44 వేల రూపాయిలను వసూలు చేసింది.మరి రాబొయ్యే రోజుల్లో టెంపర్ రికార్డు ని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 1 గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.