Tollywood Heroes Remuneration: టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది..అలా మన టాలీవుడ్ రేంజ్ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లిన ఘనత మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి గారిదే..బాహుబలి సినిమా తో ఆయన మన మార్కెట్ ని ప్రపంచ దేశాలకు విస్తరింప చేసాడు..ఇప్పుడు #RRR తో మరోసారి మన మార్కెట్ ని పదింతలు పెంచేసాడు..అంతే కాకుండా OTT వృద్ధి చెందిన తర్వాత నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా బాగా పెరిగిపోయాయి..దాంతో హీరోలు రెమ్యూనరేషన్స్ ని భారీగా పెంచేశారు..ఒక్కప్పుడు 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ తీసుకునే హీరోలు ఇప్పుడు ఏకంగా వందల కోట్ల రూపాయిలు తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు..ప్రస్తుతానికి సీనియర్ హీరోల నుండి స్టార్ హీరోలు ఎంతెంత రెమ్యూనరేషన్స్ తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాము.

1.) ప్రభాస్ :
బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమాలే..అందుకే ఆయన ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయిలు తీసుకుంటున్నాడు..ఇక త్వరలో ఆయన సందీప్ వంగ తో చెయ్యబొయ్యే స్పిరిట్ సినిమాకి 150 కోట్ల రూపాయిలు తీసుకోబోతున్నట్టు సమాచారం.
2)పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే..ఆయనకి మొదటి రోజు వచ్చే వసూళ్లు టాలీవుడ్ లో మరో స్టార్ హీరో కి రాదు..ఎంత పెద్ద ఫ్లాప్ అయినా కూడా ఓపెనింగ్స్ మిగిలిపోతాయి..అందుకే ఆయన పాన్ ఇండియా సినిమాలు చెయ్యకపోయినా నిర్మాతలు వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలకు 50 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్స్ ఇచ్చారు..ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రానికి కూడా 65 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.
3)మహేష్ బాబు :
మహేష్ బాబు పారితోషికానికి బదులుగా సినిమాకి పార్టనర్ గా ఉంటూ వస్తున్నాడు..శ్రీమంతుడు సినిమా నుండి ఆయన ఇదే ఫాలో అవుతున్నాడు..అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఆయన చెయ్యబోతున్న సినిమాకి మాత్రం రెమ్యూనరేషన్ రూపం లో తీసుకోబోతున్నాడట..ప్రాంతీయ బాషా చిత్రం గా తెరకెక్కబోతున్న త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు 65 కోట్ల రూపాయిలు తీసుకోబోతున్నట్టు సమాచారం .
4) రామ్ చరణ్ :
రామ్ చరణ్ గత గత చిత్రం #RRR కోసం 45 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు..గతం లో ఆయనకీ ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్ళు నిర్మాతలు..ఇక ప్రస్తుతం శంకర్ తో ఆయన చేస్తున్న సినిమా కోసం 65 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అట..ఈ సినిమా హిట్ అయితే భవిష్యత్తు లో చెయ్యబొయ్యే సినిమాలకు వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
5) ఎన్టీఆర్ :
ఈయన కూడా #RRR చిత్రానికి గాను 45 కోట్ల రూపాయిల పారితోషికం పుచ్చుకున్నాడు..అంతకు ముందు సినిమాలకు రామ్ చరణ్ ఒక్కో సినిమాకి 30 కోట్లు తీసుకునేవాడు..అయితే ప్రస్తుతం త్వరలోనే ఆయన కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయ్యే సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమాకి గాను ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

6.) అల్లు అర్జున్ :
అల్లు అర్జున్ కూడా ఒక్కో సినిమాకి 30 కోట్ల రూపాయిల రేంజ్ లో తీసుకునేవాడు..పుష్ప సినిమాకి మాత్రం 40 కోట్ల రూపాయిలు తీసుకున్నాడు..కానీ త్వరలో తెరకెక్కబోతున్న పుష్ప పార్ట్ 2 కి మాత్రం బిజినెస్ లో భాగస్వామ్యం కావాలని అడుగుతున్నాడట అల్లు అర్జున్.
ఇది సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి 50 కోట్ల రూపాయిలు , బాలకృష్ణ 15 కోట్ల రూపాయిలు..వెంకటేష్ మరియు నాగార్జున చెరో సినిమాకి 7 కోట్ల రూపాయిలు తీసుకున్నటున్నారట..ఇక యంగ్ హీరోలు నాని 10 కోట్ల రూపాయిలు, విజయ్ దేవరకొండ 15 కోట్ల రూపాయిలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.