Balagam- Ranga Maarthaanda: మంచి సినిమా తీస్తే సరిపోదు..సరైన ప్రొమోషన్స్ చెయ్యాలి, ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించేలా ఉండాలి, ప్రమోషనల్ కంటెంట్ బాగుండాలి, అప్పుడే కమర్షియల్ గా కూడా సక్సెస్ లను చూడగలం. అందుకు రీసెంట్ ఉదాహరణగా నిలిచాయి రెండు సినిమాలు. ఒకటి తెలంగాణ సంస్కృతికి అడ్డం పట్టేలా తెరకెక్కించిన ‘బలగం’ సినిమా అయితే, మరొకటి జీవిత ఇతివృత్తాన్ని, జీవిత సత్యాలకు అద్దం పట్టేలా ఉన్న ‘రంగమార్తాండ’ సినిమా.
ఈ రెండు సినిమాలకు అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి,టాక్ అదిరిపోయింది.కానీ ‘బలగం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర తిరగరాస్తే, ‘రంగమార్తాండ’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే చిల్లర వసూళ్లను నమోదు చేసుకుంది.’బలగం’ సినిమాలో ‘రంగమార్తాండ’ లో ఉన్నటువంటి లెజండరీ నటీనటులు లేరు.డైరెక్టర్ కూడా ‘బలగం’ చిత్రానికి ఒక జబర్దస్త్ ఆర్టిస్టు వేణు, కానీ ‘రంగమార్తాండ’ కి ఎన్నో క్లాసికల్ హిట్స్ ఇచ్చిన లెజండరీ డైరెక్టర్ ‘కృష్ణవంశీ’.అయ్యినప్పటికీ కూడా ‘రంగమార్తాండ’ చిత్రానికి ‘బలగం’ కి వచ్చిన వసూళ్ళలో ఒక్క శాతం కూడా లేకపోవడం గమనార్హం.
ఈ రెండు సినిమాలకు ఇంత వ్యత్యాసం ఉండడానికి కారణం ప్రమోషనల్ కంటెంట్.బలగం చిత్రం తక్కువ బడ్జెట్ తో తీసినప్పటికీ,ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ లో క్వాలిటీ కనిపించింది. కానీ ‘రంగమార్తాండ’ కి సంబంధించి ప్రతీ ఒక్కటి ప్రేక్షకులకు ఎంతో నాశిరకంగా అనిపించాయి. అందుకే కమర్షియల్ గా ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది, బలగం అంత పెద్ద హిట్ అయ్యింది. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మంచి సినిమా తీస్తే కాదు, క్వాలిటీ మైంటైన్ చెయ్యాలి.లేకుంటే జనాలు థియేటర్ వైపు కూడా చూడరు.
ఇప్పుడు వస్తున్న సినిమాలు కొన్ని బాగా ఆడుతున్నాయి అంటే అందుకు కారణం ప్రమోషనల్ కంటెంట్ బాగుండడం వల్లే, ప్రమోషనల్ కంటెంట్ బాగాలేకపోతే ఎంత మంచి సినిమా తీస్తే వ్యర్థమే, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మంచి సినిమాలను ఆదరించడం లేదని ప్రేక్షకుల మీద ఆరోపణలు చేస్తే చేసేది ఏమి ఉండదు.ఇప్పటికైనా మేకర్స్ మేలుకుంటారని ఆశిద్దాం.