
Telangana Culture : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇటీవల వచ్చిన బలగం, దసరా చిత్రాలు తెలంగాణ ప్రాంత యాసలో తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగాన్ని పునరుజ్జీవింపజేస్తున్న కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ యాస ఒకప్పుడు అపహాస్యం పాలయ్యేదని, ఇప్పుడు దానికి పెద్దపీట వస్తోందన్నారు. సోషల్ మీడియాలో కొందరు సంతోషం వ్యక్తం చేయగా, అక్కడ కేటీఆర్, కేసీఆర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు
క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కేనా..
దసరా బాక్సాఫీస్ వద్ద వండర్స్ చేస్తున్న సమయంలో బలగం స్లీపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాలలో తెలంగాణ సంస్కృతి, నేటివిటీని పూర్తి ప్రామాణికతతో అద్భుతంగా స్థాపించారు, ఇది కూడా వారి విజయానికి ఒక కారణమైంది. అయితే కేటీఆర్ ఈ సినిమాల క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
వారి త్యాగం వట్టిదేనా..
తెలంగాణ కోసం సబ్బండ వర్ణాలు ఉద్యమించాయని, 1200 మంది ప్రాణత్యాగం చేశారు. ఎంతో మంది ఉద్యమం కోసం ఉద్యోగాలు కోల్పోయారు, జైలుపాలయ్యారు. కేసుల కోసం ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయంలో వచ్చే సినిమాలు తెలంగాణకు గర్వకారణమే. కానీ, క్రెడిట్‌ను కేసీఆర్ ఖాతాలో వేయడమే చాలా మందికి నచ్చడం లేదు. దీంతో కేటీఆర్ ట్వీట్‌పై పాజిటివ్‌గా ఎంతమంది కామెంట్లు పెడుతున్నారో.. అంతే మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.

తెలంగాణ ద్రోహుల మాటేంటటున్న నెటిజన్లు..
తెలంగాణ మొత్తం కేసీఆర్ సాధిస్తే మరి ఉద్యమకారులు ఏమయ్యారని ప్రశ్నిస్తున్న నెటిజన్లతోపాటు తెలంగాణ ద్రోహుల ముచ్చట కూడా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. తెలంగాణ ద్రోహుల ఎలా పదువులు అనుభవిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వద్దని, తెలంగాణ అంటే జైలుకు పంపుతామన్నవారి ఇప్పుడు కీలక పదవుల్లో ఎందుకు ఉన్నారని నిలదీస్తున్నారు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచరి తల్లి ఎక్కడ ఉంది, జేఏసీ చైర్మన్ కోందరామ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
బంగారు తెలంగాణ ఇదేనా..
బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అని చెబుతున్న కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రం ఎక్కడ బంగారం అయిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌రావు మాత్రమే పదవులు అనుభవిస్తున్నారని, ఇలాంటప్పుడు కేసీఆర్ కుటుంబం బంగారుమయం అయింది కానీ, తెలంగాణ ఎక్కడ బంగారం అయిందని నిలదీస్తున్నారు.
తెలంగాణ క్రెడిట్ మొత్తం ఒక్కరి ఖాతాలో వేయడం సరికాదన్న భావనే చాలా మందిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ కుటుంబంపై ఎంత వ్యతిరేత ఉందో కేటీఆర్ ట్వీట్‌పై చేస్తున్న కామెంట్లు అద్దం పడుతున్నాయని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.