Pawan Kalyan Assets: పవన్ కళ్యాణ్ సినిమా హీరోకి మించి గొప్ప మానవతావాది. అందుకే ఆయన ఇతరుల కంటే ప్రత్యేకం. పవన్ కళ్యాణ్ ని దగ్గరగా చూసిన వారెవరైనా అభిమానిగా మారిపోతారు. ఆయన డౌన్ టు ఎర్త్ బిహేవియర్ కి ముగ్దులై పోతారు. పవన్ నిజ జీవితంలో ఇలా ఉంటారా! అని ఆశ్చర్యచకితులవుతారు. ఆయన స్టార్డం, ఫాలోయింగ్ కి ప్రవర్తనకు అసలు పొంతన ఉండదు. నిరాడంబర జీవితం ఇష్టపడతారు. లగ్జరీ లైఫ్ కి దూరంగా ఉండాలనుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి డబ్బు వ్యామోహం లేదు. దాన్ని ఆయన తుచ్ఛంగా చూస్తారు. మనిషి అవసరాలకు మించి డబ్బు అవసరం లేదని నమ్ముతారు.

హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ వద్ద వందల, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చాలా మంది అపోహ. కానీ ఎప్పటికప్పుడు సంపాదించింది సమాజ సేవకు, దానాలకు ఖర్చు చేస్తూ పవన్ పెద్దగా కూడబెట్టలేదు. ఇటీవల అన్నయ్య చిరంజీవి మాట్లాడుతూ… మొన్నటి వరకు కూడా పవన్ కి సొంత ఇల్లు లేదన్నారు. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆస్తుల వివరాలు బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద వ్యామోహం లేదు. అందుకే స్టార్ హీరోగా ఉండి కూడా పెద్దగా సంపాదించలేదు. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఆస్తులు… ఒక ఇల్లు, స్థలం, కార్లు మాత్రమే. అవి కూడా తాకట్టులో ఉన్నాయి. పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు కూడా తీసి పార్టీ కోసం వాడారు. జానీ మూవీ టైంకి పవన్ రెమ్యూనరేషన్ కోటిన్నర. నష్టపోయిన బయ్యర్లకు ఆ మొత్తం ఇచ్చేశాడు. చాలకపోతే స్థలం అమ్మి ఇవ్వబోయాడు. నేను వద్దని ఆపాను. అన్నయ్య చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి కోట్లు సమాజం కోసం ఖర్చు చేశారు.

పవన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ, పార్టీ కోసం తన సంపాదన ఖర్చు చేస్తున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు సెట్స్ పై ఉంది. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ షూట్ చివరి దశకు చేరింది. ఇక సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. హరీష్ శంకర్ తో ప్రకటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. రానున్న రెండేళ్లలో పవన్ బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ఫ్యాన్స్ ని అలరించనున్నారు.