
Amigos Movie Amazing Things: నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది..సాధారణంగా ఇలాంటి కథలతో డైరెక్టర్స్ ప్రేక్షకుల మైండ్ తో ఆడేసుకుంటారు, కానీ ఈ సినిమా ద్వారా రాజేందర్ రెడ్డి ప్రతీ ప్రేక్షకుడిగా అర్థం అయ్యే విధంగా స్క్రీన్ ప్లే నడిపించడం వల్లే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
Also Read: Telangana Polls : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. 17న సీఎం కేసీఆర్ ప్రకటన?
ఇందులో త్రిపాత్రాభినయం చేసిన కళ్యాణ్ రామ్ నటనలో మరోసారి శభాష్ అనిపించుకున్నాడు.గత ఏడాది ఆయన ‘భింబిసారా’ చిత్రం తో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడో అందరికీ తెలిసిందే.అలాంటి హిట్ తర్వాత మరో లెవెల్ కి వెళ్లేందుకు పెద్ద డైరెక్టర్ తో కమర్షియల్ సినిమానే చెయ్యాలనుకుంటారు కానీ నూతన దర్శకుడికి అవకాశం ఇచ్చి ఒక కొత్త కాన్సెప్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని కళ్యాణ్ రామ్ చేసిన ప్రయత్నం ని మెచ్చుకొని తీరాల్సిందే.
ఈ చిత్రం లో మనం గమనించని అంశాలు చాలానే ఉన్నాయి..ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజేందర్ రెడ్డి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి శిష్యుడు.ఆయన దర్శకత్వం లో వచ్చిన ‘గాయం 2’ చిత్రానికి రాజేందర్ రెడ్డి కథ అందించాడు..ఈ చిత్రం 2010 వ సంవత్సరం లో విడుదలైంది..ఆ తర్వాత ఆయన ఏ సినిమాకి కూడా పనిచేయలేదు..కళ్యాణ్ రామ్ అతనిని గుర్తించి అవకాశం ఇచ్చాడు..అందుకు మెచ్చుకోవాల్సిందే..అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషిక రంగనాథ్ కి ఇది తొలి సినిమా కాదు, కన్నడ లో ఈమె పాపులర్ స్టార్ హీరోయిన్.
ఈ చిత్రం లో ఈమె అందాలను చూసి కుర్రాళ్లు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ’ పాటలో ఈమె డ్యాన్స్ మరియు అందాలు చూస్తే స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని అనిపించక తప్పదు.ఈ చిత్రం తర్వాత ఆమెకి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు కూడా రావొచ్చు.

ఈ సినిమా కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో ఇదివరకే ఒక సినిమా వచ్చింది..1986 వ సంవత్సరం లో ‘3 అమిగోస్’ అనే పేరు తో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఆ సినిమా ఒకసారి చూస్తే అమిగోస్ కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అని అర్థం అయిపోతుంది..తెలుగు లో కూడా త్రిపాత్రాభినయం తో కూడిన సినిమాలు చాలానే వచ్చినప్పటికీ ఈ ‘అమిగోస్’ మూవీ కథ చాలా కొత్తరకం టేకింగ్ తో ఉండడం తో ఆడియన్స్ లో కూడా కొత్తతరహా సినిమా చూశామని అనుభూతి కలుగుతుంది.
Also Read: Amigos Movie Story: ‘అమిగోస్’ కథ అతని జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని చేసిందా?బయటపడ్డ షాకింగ్ నిజాలు