https://oktelugu.com/

Tomato Prices Increase: సెటైర్: టమాటాపై ఏశారు.. కళ్యాణ్ జ్యువెలర్స్ ను లాగారు

సోషల్‌ మీడియాలో మీమ్స్‌ గురించి పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రం హసన్‌లో టమాటా దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.2.7లక్షల విలువైన టమాటాలను చోరీ చేశారు. ఈ మేరకు హళేబీడు పోలీసులకు బాధిత రైతు ధాహ్రానీ ఫిర్యాదు చేశారు. మంగళవారం తన ఫాంహౌ్‌సలో 90 బాక్సుల టమాటాలను ఉంచానని, రాత్రి 9.30 గంటల వరకూ తాను అక్కడే ఉన్నట్లు రైతు తన ఫిర్యాదులో తెలిపారు.

Written By:
  • Rocky
  • , Updated On : July 6, 2023 / 07:08 PM IST

    Tomato Prices Increase

    Follow us on

    Tomato Prices Increase: అయితే ఆకాశన్నంటుంది. లేకుంటే రోడ్ల పాలవుతుంది. టమాటా గురించి స్ఫురణకు వస్తే పై వాక్యాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధర చుక్కలను దాటేసింది. కొన్ని చోట్ల రూ.150 దాటి పలుకుతోంది. దీంతో టమాటాలను కొనుగోలు చేయాలంటేనే జనాలు జంకుతున్నారు. టమాటాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్రం అ డుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే ఎన్నికల కాలం, పైగా టమాటా లేనిది ఏ ఇంట్లో కూర ఉడకదు. దీంతో ప్రభుత్వాలు ధరల నియంత్రణ కోసం నడుం బిగించాయి. ఏపీ ప్రభుత్వమైతే సబ్సిడీ మీద టమాటా పంపిణీ చేసేందుకు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

    ఇక పెరిగిన టమాటాల ధరలతో సోషల్‌ మీడియాలో మీమర్స్‌ చెలరేగిపోతున్నారు. ప్రజాదరణ పొందిన సినిమాల్లో సన్నివేశాలు, చిత్రాలతో మీమ్స్‌ రూపొం దిస్తున్నారు. పెరిగిన ధరల వల్ల ప్రజలు ఎంత ఇబ్బందిపడుతున్నారో వ్యంగ్యంగా చూపిస్తున్నారు. కళ్యాణ్ జ్యూవెల్లరీ షాపులో బంగారానికి బదులు టమాటాలను భద్రపరుస్తారు. వాటికి కాపలాగా కొంత మంది ఉంటారు. పెరిగిన ధరలను ప్రతిబింబిస్తూ రూపొందించిన ఈ మీమ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతన్నప్పటికీ టమాటా ధరలే ట్రెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న మహారాష్ట్రంలో బీజేపీ, శివసేన ప్రభుత్వంలో ఎన్‌సీపీ చేరింది. అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సంచ లన వార్త కూడా టమాటా ముందు తేలిపోయింది.

    ఇక సోషల్‌ మీడియాలో మీమ్స్‌ గురించి పక్కన పెడితే కర్ణాటక రాష్ట్రం హసన్‌లో టమాటా దొంగలు రెచ్చిపోయారు. దాదాపు రూ.2.7లక్షల విలువైన టమాటాలను చోరీ చేశారు. ఈ మేరకు హళేబీడు పోలీసులకు బాధిత రైతు ధాహ్రానీ ఫిర్యాదు చేశారు. మంగళవారం తన ఫాంహౌ్‌సలో 90 బాక్సుల టమాటాలను ఉంచానని, రాత్రి 9.30 గంటల వరకూ తాను అక్కడే ఉన్నట్లు రైతు తన ఫిర్యాదులో తెలిపారు. బుధవారం ఉదయం ఫాంహౌ్‌సకు వచ్చి చూడగా ఆ బాక్సు లు కనిపించలేదని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈసంఘటన సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది. బంగారం కంటే టమాటాలకే విలువ ఎక్కువ ఉందని, అందుకే దొంగలు చోరీ చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.