https://oktelugu.com/

థియేటర్లు కనుమరుగు.. అమెజాన్ గోడౌన్లుగా మార్పు

కథ కంచికి.. థియేటర్లకు మూతకు ఉన్నట్టుగా పరిస్థితి తయారైందట.. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్రాలు అనుమతి ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకులు ఎవరూ థియేటర్ల వైపుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అపారనష్టంతో థియేటర్ల యజమానులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. థియేటర్లు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మల్టీప్లెక్స్ లు పెరగడంతో సింగిల్ థియేటర్లు పునరుద్దరించే సూచనలు కనిపించడం లేదు. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2020 / 08:27 PM IST
    Follow us on

    కథ కంచికి.. థియేటర్లకు మూతకు ఉన్నట్టుగా పరిస్థితి తయారైందట.. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు తెరిచే పరిస్థితి లేదు. కేంద్ర, రాష్ట్రాలు అనుమతి ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకులు ఎవరూ థియేటర్ల వైపుకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. అపారనష్టంతో థియేటర్ల యజమానులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. థియేటర్లు మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంటాయన్న గ్యారెంటీ లేదు. మల్టీప్లెక్స్ లు పెరగడంతో సింగిల్ థియేటర్లు పునరుద్దరించే సూచనలు కనిపించడం లేదు.

    Also Read: మంగళవారం ఎవరికైనా డబ్బులు ఇస్తున్నారా… అయితే జాగ్రత్త!

    దీంతో థియేటర్లను నడిపించలేక.. అమ్ముకోలేక యజమానులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అమెజాన్ క్యాష్ చేసుకుంటోంది. రెట్టింపు ఆదాయం ఆఫర్ చేసి థియేటర్లను లీజుకు తీసుకునే దిశగా అమెజాన్ ఈకామర్స్ సంస్థ అడుగులు వేస్తోంది.

    ఇప్పటికే హైదరాబాద్ లో అమెజాన్ అతిపెద్ద గోడౌన్ ఉంది. ఇప్పుడు స్థానిక నగరాల్లో థియేటర్లను తీసుకొని వాటిని గోడౌన్లుగా మార్చడంపై దృష్టిపెట్టింది.

    Also Read: కొట్టుకున్న వైసీపీ నేతలు.. ‘ఆమంచి’ని పరిగెత్తించారు

    భారత్ లో రీటెయిల్ మార్కెట్ పై పట్టు సాధించాలన్నది అమెజాన్ లక్ష్యం. ఆర్డర్ చేసిన ఐటమ్ ను అత్యంత వేగంగా కస్టమర్ కు చేరవేయడం ద్వారా రీటెయిల్ రంగంలో ఆధిపత్యం సాధించవచ్చని సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మూతపడడానికి సిద్ధమైన థియేటర్లను తీసుకొని ఎక్కడికక్కడ గోడౌన్లుగా సిద్ధం చేయాలని అమెజాన్ సంస్థ నిర్ణయించింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్