https://oktelugu.com/

Somu Veeraju : బిజెపిలో జనసేనతో పొత్తు సెగలు.. సోము వీర్రాజు ఏమన్నారంటే..?

Somu Veeraju : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత బిజెపి – జనసేన పొత్తుపై వాడి వేడిగా చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరింత అగ్గి రాజుకున్నట్టు అయింది. రెండు పార్టీల మధ్య పొత్తుపై బిజెపి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఏపీలో జనసేనతో పొత్తు వ్యవహారంపై బీజేపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి పొత్తు కొనసాగిస్తున్నామంటూ, మరోసారి పొత్తు ఉన్నా లేనట్టే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 22, 2023 8:57 pm
    Follow us on

    Somu Veeraju : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత బిజెపి – జనసేన పొత్తుపై వాడి వేడిగా చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరింత అగ్గి రాజుకున్నట్టు అయింది. రెండు పార్టీల మధ్య పొత్తుపై బిజెపి నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ ఉండడం గమనార్హం.

    ఏపీలో జనసేనతో పొత్తు వ్యవహారంపై బీజేపీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి పొత్తు కొనసాగిస్తున్నామంటూ, మరోసారి పొత్తు ఉన్నా లేనట్టే అంటూ బిజెపి నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో రచ్చకు కారణం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిజెపి అభ్యర్థి మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు దిద్దుబాటు చర్యలకు దిగుతున్నట్లు కనిపిస్తోంది.

    బిజెపి – వైసిపి ఒక్కటే.. అపోహ మాత్రమే..

    జనసేన – బిజెపి పొత్తు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు స్పందించేందుకు నిరాకరించారు. అయితే, మాధవ వ్యాఖ్యల తర్వాత బిజెపి జనసేన పొత్తుకు కాలం చెల్లిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం సోము వీర్రాజు ఖండించారు. బిజెపి – జనసేన విడిపోతాయని చెప్పనంటూ పొత్తులపై సోము పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అలాగే మీ కోరిక ఫలించడంతో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో బిజెపి – వైసిపి ఒక్కటే అని జరుగుతున్న ప్రచారంపై బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైన సోమ వీర్రాజు స్పందించారు. అది కేవలం అపోహ మాత్రమేనని.. వైసీపీపై తను ఇవాళ కూడా విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

    అమరావతి అభివృద్ధికి నిధులు..

    ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని చెప్పే పార్టీ బిజెపి అని సోమ వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకే మోదీ నిధులు ఇచ్చారని, విజయవాడలోనే మూడు ఫ్లై ఓవర్లు, ఇబ్రహీంపట్నం వద్ద ఆరు లైన్ల వంతెన నిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడ కేంద్రంగా అన్ని వైపులా ఆరు లైన్ల జాతీయ రహదారి వేసామన్నారు. డబ్బులు ఇస్తే అభివృద్ధి చేయకుండా మాటలు చెబుతున్నారని వైసీపీ ప్రభుత్వం పైన సోము వీర్రాజు మండిపడ్డారు. ఇక్కడే రాజధాని అన్న ఉద్దేశంతో ఎయిమ్స్ తో పాటు అనేక సదుపాయాలు కల్పించామన్నారు. ఇదే రాజధాని, అభివృద్ధి చేస్తా, ఇల్లు కట్టా అని ఆనాడు చెప్పారంటూ జగన్ పైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు విశాఖ రాజధాని అని మాట మార్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇల్లు కట్టుకొని విశాఖకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం 200 కోట్లు కూడా విశాఖకు ఖర్చు చేయలేదని, జగన్ ప్రభుత్వం షార్జ్ షీట్ సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. చేసి జగన్ మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్ చంద్రబాబు ఇద్దరూ కాంగ్రెస్ లో శిక్షణ పొందిన వారేనని, తమకు హత్యలు, దోపిడీలు చేసిన నాయకులు లేరన్నారు.

    సోము వీర్రాజు వ్యాఖ్యల వెనుక మర్మమేమిటి..?

    ఒకపక్క బీజేపీ కీలక నాయకులు జనసేన తో పొత్తు పెటాకులు అయినట్టు చెబుతుంటే.. మరొక రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. మాధవ్ వ్యాఖ్యల తర్వాత రాష్ట్రంలో బిజెపి – జనసేన పొత్తు ముగిసిన అధ్యాయంగా అందరూ భావించారు. అయితే, సోము వీర్రాజు పొత్తు కొనసాగుతున్నట్టుగానే చేసిన తాజా వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీని వెనుక పెద్ద వ్యూహం దాగి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.