GHMC Office: వారం రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణలో అయితే ఎటు చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. ఇక రాజధాని హైదరాబాద్ పరిస్థితి చెప్పరానిది. దాదాపు చెరువులో నగరం జీవిస్తున్నట్లు తలపిస్తోంది. కొన్ని రోజులగా ఇళ్లలో నుంచి బయటకు రానివారు ఎందరో ఉన్నారు. ప్రభుత్వం సైతం విద్యాసంస్థలతో పాటు కొన్ని కార్యాలయాలను ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా వర్షాలకు వరదలు ఏరులై పారుతున్నాయి. దీంతో కాలనీల్లోని మురుగునీరు బయట ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కాటకాలు, పురుగులు ఇంట్లోకి చొరబడుతున్నాయి. అయితే ఓ కాలనీకి చెందిన వ్యక్తి తమ ఇళ్లల్లోకి పాములు చొరబడుతున్నాయని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన ఏం చేశాడో తెలుసా?
హైదరాబాద్ లోని అల్వాల్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కొన్ని కాలనీ వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉండి జీవనం సాగిస్తున్నారు. వర్షం తగ్గినప్పుడల్లా ఆ నీటిని బయటకు పోస్తున్నారు. ఈ క్రమంలో వర్షపు నీరు తగ్గాక సంపత్ అనే ఇంట్లో పాము కనిపించింది. ఇతర ఇళ్లల్లోనూ ఇలాంటే సమస్యలే ఎదురయ్యాయి. దీంతో ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
తమ కాలనీలో మురుగునీరు క్లియర్ చేయకపోవడంతోనే పాములు, పురుగులు వస్తున్నాయని తెలిపాడు. అయితే ఆయన ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచింది. అయినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆయనకు చిర్రెత్తు కోపం వచ్చింది. దీంతో ఓ పామును తీసుకొని ఆయన జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెల్లాడు. అక్కడ ఓ అధికారి టేబుల్ పై ఆ పామును ఉంచి అసలు విషయం చెప్పాడు. దీంతో కొందరు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడదీ వైరల్ గా మారింది.