America: ‘మొగుడు కావాలి’ అనే పదం ఇప్పటి వరకు సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ ఒక మహిళ చేతిలో బోర్డు పట్టుకొని మరీ తనకు భర్త కావాలంటూ వేడుకుంది. సాధారణంగా ఎవరైనా తనకు తోడు కావాలంటే మ్యాట్రిమెనీ లాంటి వాటిని సంప్రదిస్తారు. కానీ ఓ మహిళ మాత్రం బోర్డు పట్టుకొని రోడ్డుపై నిల్చుని మొగుడు కావాలంటూ రోడ్డుపైకి వచ్చింది. అయితే ఇలా వచ్చిన ఆమెకు 30 నిమిషాల తరువాత షాకింగ్ రిజల్ట్ కనిపించింది. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న ఫలితం ఏంటో తెలుసా?
అమెరికాకు చెందిన కరోలినా గీట్స్ రెండేళ్లుగా ఒంటరిగా ఉంటోంది. తనకు తోడు కావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తెలిసిన వారికి పరోక్షంగా తన గురించి తెలియజేసింది. కానీ ఫలితం లేదు. చివరికి టిండర్, హింజ్ లాంటి డేటింగ్ యాప్ లను సంప్రదించింది. ఈ యాప్ ల ద్వారా చాలా మంది అమెకు పరిచయం అయ్యారు. కానీ ఆమె అనుకున్న విధంగా ఎవరూ లేరు. ఫలితంగా ఆమెను వేరే కోణంలో మాత్రమే చూశారు. దీంతో వారెవరు ఆమెకు నచ్చలేదు. ఇలా యాప్ ల ద్వారా విసిగిపోయిన ఆమె చివరికి భర్తను ఎన్నుకోవడంలో కొత్త పద్ధతిని పాటించారు.
తాజాగా అమెరికాలోని సాహో పట్టణంలో ఒక బోర్డుపై ‘భర్త కోసం వెతుకుతున్నాను’ అని రాసి పెట్టింది. ఈ బోర్డును పట్టుకొని ఆమె రోడ్డుపై నిల్చుంది. అలా నిల్చున్న తరువాత ఆమెను చాలా మంది విచిత్రంగా చూశారు. కానీ 30 నిమిషాల తరువాత ఓ వ్యక్తి వచ్చి తాను కలిసి ఉంటానని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ తరువాత తన గురించి తెలుసుకోవాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తరువాత కరోలినా అక్కడి నుంచి వెళ్లిపోయింది.