https://oktelugu.com/

Warangal : ఆ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి రెండు చేతులెత్తి మొక్కాల్సిందే

అయితే ఆ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దీన్ని గమనించి తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకు లాగడంతో ప్రాణాలు నిలిచాయి

Written By:
  • BS
  • , Updated On : June 11, 2023 / 04:15 PM IST
    Follow us on

    Warangal : రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి మరో మహిళ ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. సదరు మహిళ ప్రయాణీకురాలి ప్రాణాలను కాపాడిన మహిళా కానిస్టేబుల్ సోనాలి మాల్కేను పలువురు అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.
    రైలు దిగుతున్న ఒక మహిళ కాలుజారి ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ పైనుంచి ట్రాక్ మీదకు ట్రైన్ వుండగానే పడిపోయింది. కొద్ది క్షణాల్లో ట్రైన్ మూవ్ కాబోతోంది. రైలు గాని ప్రారంభమైతే ఆ మహిళ ప్రాణాలను కోల్పోయేది. అయితే, ఆ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న మహిళ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ రెప్పపాటు వేగంతో వెళ్లి ఆ మహిళను కాపాడింది. కాలుజారి ప్లాట్ఫామ్ కు, రైలుకు మధ్య ఇరుక్కుపోయిన మహిళను అత్యంత వేగంగా బయటకు తీయడంతో సదరు మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. అత్యంత వేగంగా స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోనాల్ ను అభినందిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం జరిగిన రెప్పపాటులో ఒక మహిళ ప్రాణాలు పోయేవని పలువురు పేర్కొంటున్నారు. తక్షణం స్పందించిన సోనాలీను రైల్వే అధికారులు ప్రయాణికులు అభినందించారు.
    మణుగూరు ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న మహిళ..
    శనివారం రాత్రి మణుగూరు ఎక్స్ప్రెస్ నుంచి ఒక మహిళ వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగుతోంది. అయితే, దిగే క్రమంలో మెట్లపై నుంచి జారీ కింద పడబోయింది. మహిళ కాలు ట్రైన్ కు ప్లాట్ఫామ్ కు మధ్య ఉన్న సందులో దిగింది. ఆ సమయంలో ట్రైన్ కదిలితే మహిళ ప్రాణాలకే ముప్పు పొంచి ఉండేది. అయితే ఆ దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దీన్ని గమనించి తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకు లాగడంతో ప్రాణాలు నిలిచాయి. ప్రతి కానిస్టేబుల్ కూడా ఈ విధంగా విధులు నిర్వహిస్తే చాలా ప్రమాదాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. సదరు మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి చేతులెత్తి మొక్కాలి అంటూ పలువురు పేర్కొంటున్నారు.