
MS Dhoni Daughter: ఐపీఎస్ సీజన్ 16లో క్రికెటర్ల పిల్లలు కూడా సందడి చేస్తున్నారు. ఒకవైపు క్రికెటర్లు తమ ఆటతో ఫ్యాన్స్‌ను, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. కొత్త ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నారు. ఇక యువ క్రికెటర్లు తమ ఆటతీరుతో ఆడియన్స్‌కు పండుగ చేస్తున్నారు. కోహ్లీ లాంటి సీనియర్ క్రికెటరే యువ క్రికెర్లలా తాము ఆడలేం అనేలా రెచ్చిపోతున్నారు. వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది చివరన ఉన్న నేపథ్యలో జట్టులో ఎంపిక కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు ఇదే సీజన్‌లో క్రికెటర్లతోపాలు జిల్లలు కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బెంగళూర్‌లో ఓ బుడతడు కోహ్లీ కూతురును డేట్క్ రమ్మని అడగగా, తాజాగా ధోనీ కూతురు జీవా మైదానంలో తండ్రిని ఎంకరేజ్ చేస్తూ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కోహ్లీ.. కూతురును డేట్‌కు తీసుకెళ్తా అని
బెంగళూర్‌లో ఇటీవల చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ చెన్నై తరఫున ఆడగా, మరో స్టార్ క్రికెటర్ కోహ్లీ బెంగళూర్ జట్టు తరఫున ఆడారు. ఈ మ్యాచ్ రికార్డుస్థాయిలో వ్యూవర్‌షిప్ కూడా సొంతం చేసుకుంది. గత రికార్డులను చెరిపేసింది. ఈ మ్యాచ్‌లో ఓ బుడతడు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ‘కోహ్లీ అంకుట్ వామికను డేట్‌కు తీసుకెళ్లొచ్చా’ అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకుని కనిపించాడు. ఈ బుడతడి రిక్వెస్ట్ చూసి ఆడియన్స్ నవ్వుకున్నారు. ఇక మైదానంలోకి ఎమెరాలన్నీ దానిని క్లిక్ మనిపించాయి. ఓ వ్యక్తి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కొందరు బుడతడి రిక్వెస్ట్‌కు నవ్వుకుంటూ సరదాగా కామెంట్స్ పెట్టగా, మరికొందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవా సందడి మామూలుగా లేదు..
ఇక తాజాగా మరో స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ కూతురు జీవా బెంగళూర్ మైదానంలో చేసిన సందడి వీడియో కూడా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తన తండ్రిని ఎంకరేజ్ చేస్తూ.. ‘పప్పా.. కమాన్ పప్ప’ అంటూ కేకలు వేయడం చూసి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తల్లి సాక్షిసింగ్ పక్కన నిలబడి కూతురు తండ్రిని ఎంకరేజ్ చేయడంతోపాటు కాసేపటికి కాస్త ముందుకు వచ్చి మరోమారు పప్పా అంటూ కేకలు వేసింది. అక్కడే కూర్చున్న మరో ఆడియన్ ‘టుడే ధోనీ విన్’ అని అనడంతో జీవా అతడి భుజంపై గిల్లింది. దీంతో చుక్కుపక్కలవారు జీవా అల్లరి చూసి నవ్వుకున్నారు. ముచ్చట పడ్డారు.

నెటిజన్స్ ఫిదా..
జీవా అల్లరిని వీడియో తీసిన ఓ ఆడియన్ దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కామెంట్స్ పెడుతున్నారు. ‘పప్పా రాక్.. బేటీ క్యూట్’ అని కొందరు.. కూతురు లేకుంటే జగమే లేదని కొందరు… క్యూట్ డాటర్ అని ఇంకొందరు. బెస్ట్ ఆఫ్ లక్ ధోనీ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
మొత్తంగా ఐపీఎల్ సీజన్ ఆడియన్స్‌ను అన్నివిధాలుగా ఆకట్టుకుంటోంది. అటు క్రికెటర్లు చెలరేగుతుంటే.. ఇటు పిల్లలూ సందడిచేస్తున్నారు.