
Yoga Benefits: ఇటీవల కాలంలో చాలా మంది మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో దీర్ఘకాలం వాటితో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మందులు వాడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి జబ్బులున్నప్పుడు కొన్ని ఆసనాలు వేస్తే అవి మటుమాయం అవుతాయి. వాటిని వేసేందుకు ఉదయం సమయం కేటాయించుకోవాలి. రోజుకో గంట పాటు ఆసనాలు వేస్తే కచ్చితమైన ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ఆసనాలు ఏంటో తెలుసుకుందాం.
వజ్రాసనం
రెండు కాళ్లు మడుచుకుని మోకాళ్ల మీద కూర్చుంటే వజ్రాసనం అంటారు. ఇది మధుమేహానికి మంచి మందులా పనిచేస్తుంది. దీని వల్ల ఫ్రాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఫ్రాంక్రియాస్ గ్రంథి బాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ ప్రభావం పెరిగేలా చేస్తుంది.
అర్థమత్స్చేంధ్రాసనం
ఇది చేయాలంటే మొదట నేలపై కూర్చుండాలి. రెండు కాళ్లు ముందుకు చాచి ఉంచాలి. ఎడమ కాలిని కుడి కాలు తొడ కిందకు కుడి కాలును ఎడమ కాలు పైన మోకాలిపై పెట్టి కూర్చోవాలి. ఇలా ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత ఫలితం ఉంటుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. వెన్నెముకకు బలం కలుగుతుంది. నరాల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇన్సులిన్ ప్రభావం పెరుగుతుంది.
హలాసనం
చాప మీద పడుకుని కాళ్లు చాచాలి. చేతులను పక్కన పెట్టుకోవాలి. కాళ్లను పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. అరచేతులను నడుముపై ఉంచి మెడ నుంచి కాలు వరకు నేరుగా ఉండేలా కొద్దిగా ఎత్తులో ఉంచాలి. దీన్ని సర్వాంగాసనం అని కూడా పిలుస్తారు. ఇలా ఉండి శ్వాస పీలుస్తూ వదులుతూ పాదాలను మోకాళ్లను వంచకుంా ముఖం వెనుక నుంచి నేలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది.

పశ్చిమోత్తాసనం
నేలపై కాళ్లను చాపి కూర్చోవాలి. రెండు చేతులను పైకి లేపి చేతులతో కాలి వేళ్లను పట్టుకుని ముందుకు శరీరాన్ని వంచాలి. దీన్ని రోజు చేయడం వల్ల కడుపు కండరాలు బలంగా మారుతాయి. మలబద్ధకం, అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. లైంగిక శక్తి ఇనుమడిస్తుంది. ఇలా ఆసనాలు వేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది.
విపరీత కరుణీ ఆసనం
చాపపై కాళ్లు చాచి కూర్చోవాలి. కుడి కాలుని మడిచి పాదాన్ని వీపుపై ఉంచాలి. ఎడమ కాలుని మడిచి రెండు పాదాలను కలిపి వజ్రాసనంలో కూర్చోవాలి. ఊపిరి బాగా పీల్చి నెమ్మదిగా పడుకోవాలి. రెండు చేతులను కలిపి తలని కిందికి వంచాలి. ఈ ఆసనంలో కాసేపు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఇలా ఆసనాలు వేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగుపడుతుంది.