Bombay movie: కొందరికి అదృష్టం ఎప్పుడూ జేబులోనే ఉంటుంది. మరికొందరు దురదృష్ట దేవత తలపై నాట్యమాడుతుంటుంది. చిన్న గడ్డం సమస్య కారణంగా ఒక హీరో దేశాన్ని షేక్ చేసిన ఒక గొప్ప చిత్రాన్ని వదలుకున్నారంటే నమ్మగలరా? కానీ అదే నిజం. దేశం గర్వించే దర్శకుడు ‘మణిరత్నం’ అప్పట్లో ముంబైలో జరిగిన మతకల్లోలాల నేపథ్యంలో తీసిన ‘ముంబై’ చిత్రం దేశవ్యాప్తంగా షేక్ చేసింది. విమర్శలు వచ్చినా కూడా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోయింది. అయితే ఆ చిత్రాన్ని ఒక హీరో వదులకున్నారన్న సంగతి మీకు తెలుసా? ఎవరా దురదృష్టవంతుడైన హీరోనో తెలుసుకుందాం.

అప్పట్లో మణిరత్నం సినిమాలంటే ఓ ఆణిముత్యాలు.. ఆయనతో ఒక్క సినిమా తీయడానికి అగ్రహీరోలంతా క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన ఫేడ్ అవుట్ అయిపోయి సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యి అష్టకష్టాల్లో ఉన్నాడు. 1990వ దశకంలో మణిరత్నం సినిమాలు ఊపు ఊపాయి. ఆయన సినిమాల్లో నటించిన హీరో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు పొందారు. హిందీలోకి వెళ్లారు.
సృజనాత్మక, యాథార్థగాథలతో సహజసిద్ధమైన సినిమాలు రూపొందించడంలో మణిరత్నంది అందెవేసిన చేయి. ఆయన సినిమాలు సగటు మనిషి హృదయాన్ని తాకుతాయి. నిజజీవితానికి అద్దం పడుతాయి.
1992లో దర్శకుడు మణిరత్నం రోజా చిత్రంతో తెలుగు సినిమాలకు పరిచయమయ్యాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, మధుబాల హీరో హీరోయిన్లుగా నటించారు. రోజా సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 1993లో ‘దొంగదొంగ’ సినిమా తీశాడు. ఈ సమయంలోనే బాబ్రీ మసీదు కూల్చివేతతో ముంబైలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చూసి కలత చెందిన మణిరత్నం ఈ మత ఘర్షణలతో కూడిన ఒక మంచి కథను రాసుకున్నాడు.

అలా ఈ అద్భుతమైన కథను మొదట అప్పట్లో తెలుగులో హీరోగా వెలుగొందుతున్న సురేష్ ను అడిగాడట.. అతడు సినిమాల్లో బిజీగా ఉండడంతో వదులకున్నాడట.. ఆ తర్వాత అప్పుడప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న నేటి హీరో విక్రమ్ ను కలిసి కథ వినిపించాడట మణిరత్నం. అయితే విక్రమ్ అప్పటికే గడ్డం, మీసాలతో ఉండడం చూసి మణిరత్నం.. సినిమాలో పాత్ర పరంగా అవి తీసివేసి నటించాలని కోరాడట.. దీనికి విక్రమ్ ఒప్పుకోలేదట.. అలా ఆ ఆఫర్ రోజా సినిమాలో హీరోగా నటించిన అరవింద్ స్వామికే వెళ్లింది. కేవలం గడ్డం, మీసాలు అడ్డు అని తిరస్కరించిన హీరో విక్రమ్ ‘ముంబై’లాంటి దేశాన్ని షేక్ చేసిన మూవీని వదిలేసుకున్నాడట..
ఇటు హీరో సురేష్, అటు విక్రమ్ లు తాము ఎంత పెద్ద తప్పు చేశామో తర్వాత తెలుసుకున్నారు. అరవింద్ స్వామి, మనీషా కోయిరాలా నటించిన ముంబై మూవీ 1995 మార్చి 10న రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదలై హిట్ కొట్టింది. అయితే సినిమాపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ లో థియేటర్లను మూసివేశారు. అయినా కూడా ప్రేక్షకులు ఆదరించి దేశంలోనే సంచలన సినిమాగా నిలిచింది.
Also Read: Anchor Suma: నేనెందుకు వేయాలన్న షకీలా? సుమ తెల్లమొహం.. మధ్యలో డైరెక్టర్