TDP Leaders: ఆస్ట్రేలియాకు మద్దతా? నీ పచ్చ అభిమానం పాడుగానూ!

పాకిస్తాన్ దేశస్తులు పాకిస్తాన్ జట్టు ఆడుతుంటే ఉత్సాహపరుస్తారు. అక్కడిదాకా ఎందుకు క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నెదర్లాండ్ జట్టు అభిమానులు కూడా ఆ దేశ క్రీడాకారులు ఆడుతుంటే సంబరాలు చేసుకుంటారు.

Written By: Dharma, Updated On : November 18, 2023 11:26 am

TDP Leaders

Follow us on

TDP Leaders: పుష్కర కాలం తర్వాత భారత జట్టు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరుస విజయాలు సాధిస్తూ తిరుగులేని జట్టుగా ఆవిర్భవించింది. వరల్డ్ కప్ ఒడిసి పట్టేందుకు కేవలం ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇలాంటి సందర్భం ప్రతి భారతీయుడికి
ఉద్విఘ్నమైనది. చిరస్మరణీయమైనది కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ భారత అభిమాని అయినా సరే రోహిత్ సేన గెలవాలని కోరుకుంటాడు. దేశ యవనిక మీద వరల్డ్ కప్ అందుకుంటుంటే చూడాలని ఆశ పడుతుంటాడు. కానీ ఎవరైనా భారతదేశంలో పుట్టి మన దేశ జట్టు ఆస్ట్రేలియా మీద ఓడిపోవాలని కోరుకుంటారా? కప్పు కంగారు జట్టు సాధించాలని ఆశపడతారా? అదేంటి మీకేమైనా తలతిక్కా? ఇలాంటి ప్రశ్నలు ఇస్తారు ఎందుకు అని అనుకుంటున్నారు కదూ.. పురుషులందు పుణ్య పురుషులు వేరైనట్టు.. అభిమానమందు పచ్చాభిమానం వేరే తీరుగా ఉంటుంది. అది ఎంత పరాకాష్టకు చేరిందో ఓ వీడియో ఇప్పుడు ప్రబల సాక్ష్యంగా నిలిచింది. ఇంతకీ ఆ వీడియో ఏమిటో? ఏం జరిగిందో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం..

అభిమానాన్ని చాటుకున్నారు

పాకిస్తాన్ దేశస్తులు పాకిస్తాన్ జట్టు ఆడుతుంటే ఉత్సాహపరుస్తారు. అక్కడిదాకా ఎందుకు క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతున్న నెదర్లాండ్ జట్టు అభిమానులు కూడా ఆ దేశ క్రీడాకారులు ఆడుతుంటే సంబరాలు చేసుకుంటారు. ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చేయాలని ఎవరూ చెప్పరు. ఎందుకంటే దేశం అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్. కానీ మనదేశంలో పుట్టి.. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. అందులో భారత దేశంలో చాలామంది ఉంటారు. ఆ కోవకే చెందుతారు. ట్విట్టర్ ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఓ వ్యక్తిని ఉద్దేశించి మరో వ్యక్తి మాట్లాడుతున్నాడు. “మన దేశ జట్టు ఆస్ట్రేలియాతో ఆడితే ఆస్ట్రేలియానే గెలవాలని కోరుకుంటాడు ఇతను.. చివరికి పాకిస్తాన్ జట్టుతో ఆడినా ఆస్ట్రేలియా జట్టు మాత్రమే విజయం సాధించాలని ఆశ పడుతుంటాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా వేసుకునే జెర్సీ పసుపు రంగులో ఉంటుంది కాబట్టి.. పసుపు రంగు అంటే మాకు అభిమానం కాబట్టి” అని ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ పోయాడు. అంతే కాదు ఆస్ట్రేలియా జట్టును కీర్తించడం అంటే పసుపు అభిమానాన్ని చాటుకోవడం అని అత్యంత గర్వంగా చెప్పాడు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చె
క్కర్లు కొడుతోంది.

ఇంతకు దిగజారుతారా?

కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పుష్కరకాలం తర్వాత భారత జట్టు ఫైనల్లోకి వెళ్తే కప్ సాధించాలని కోరుకోవాల్సింది పోయి.. ఇలా ఆస్ట్రేలియాపై అభిమానం చూపడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. మీ పార్టీ మీద అభిమానం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి. అంతేకానీ ప్రత్యర్థి జట్టు వేసుకున్న జెర్సీని మీ పార్టీ రంగుకు ఆపాదించడం ఏంటని వారు విమర్శిస్తున్నారు. పార్టీ అంటే అభిమానం ఉంటుంది కానీ ఇలాంటి పైత్యం ప్రదర్శించడం ఏంటని వారు దెప్పిపొడుస్తున్నారు.. మరికొందరైతే చంద్రబాబు నాయుడు అరెస్టై జైలు నుంచి విడుదలైన తర్వాత టిడిపి నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదని వాపోతున్నారు. ఈ వీడియోను టిడిపి అభిమానులు కూడా ట్రోల్ చేస్తుండడం గమనార్హం.