https://oktelugu.com/

Uttarakhand: ఎఫైర్ పెట్టుకొని విచ్చలవిడిగా రొమాన్స్.. 19 మందికి హెచ్ఐవీ తెప్పించిన ఓ యువతి వ్యసనాల కథ

ఆమె చూడ్డానికి బాగుంటుంది. రూపం చక్కగా ఉంటుంది. అది ఆమెకు బలం.. ఎదుటి వ్యక్తులకు బలహీనత.. ఫలితంగా జరగరాని సంఘటన జరిగింది. 19 మంది జీవితాలలో చీకటి అలముకుంది.. ఈ దారుణం నైనిటాల్ జిల్లా రాంనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 1, 2024 / 05:49 PM IST

    Uttarakhand(1)

    Follow us on

    Uttarakhand: రాంనగర్ ప్రాంతంలో ఓ యువతీ ఉంటుంది. ఆమెకు ధూమపానం అలవాటు ఉంది. మద్యపానం చేస్తుంది. తరచు మాదకద్రవ్యాలు తీసుకుంటుంది. గతంలో ఆమెకు వివాహం జరిగినప్పటికీ.. ఆ అలవాట్లు చూసి భర్త విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన మరింత విచ్చలవిడిగా తయారైంది.. ఆ ప్రాంతంలో ఆమె విపరీతంగా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మొదలుపెట్టింది. అయితే ఆమె వ్యవహార శైలి తెలియని కొంతమంది.. ఆమెకు దగ్గరయ్యారు. ఆమె అవసరాలు తీర్చారు. వారి అవసరాలు కూడా తీర్చుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఆమె డబ్బులు డిమాండ్ చేస్తే.. అడిగిన మొత్తం కూడా ఇచ్చేవారు. అయితే ఇలా ఒకరికి తెలియకుండా మరొకరితో ఆమె లైంగిక సంబంధాలు పెట్టుకుంది.. మొత్తం 19 మందితో ఆమె రాసలీలలు కొనసాగించింది.. అయితే ఆ యువతి మాదకద్రవ్యాలు తీసుకునేది. వాటికోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టింది. అలా ఆమెకు హెచ్ఐవి సోకింది..

    మాదకద్రవ్యాల ఆశ చూపి

    మాదకద్రవ్యాలు తీసుకోవడం ఆమెకు అలవాటుగా మారడంతో.. ఆమెకు వాటిని ఆశగా చూపి చాలామంది అడ్డదారులు తొక్కించారు. కొందరైతే ఆమెను లోబరుచుకున్నారు. తద్వారా ఆమెకు హెచ్ఐవీ సోకింది. మాదకద్రవ్యాలు కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం కావడంతో ఆమె కూడా తప్పుడు మార్గంలో ప్రయాణం చేసింది. స్థానికంగా ఉన్న యువకులతో లైంగిక సంబంధాలను పెట్టుకుంది. ఇలా 19 మందితో ఆమె ఈ కార్యకలా పలు సాగించింది. అయితే వారిని ఇటీవల వైద్యులు పరీక్షించగా.. వారందరికీ హెచ్ఐవీ సోకినట్టు తేలింది. సాధారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రతి ఏడాదికి 20 హెచ్ఐవి కేసులు వస్తుంటాయి. అయితే రాంనగర్ ప్రాంతంలో ఒకేసారి 19 మందికి హెచ్ఐవి సోకినట్టు నిర్ధారణ కావడంతో వైద్య ఆరోగ్యశాఖ షాక్ కు గురైంది. రాంనగర్ ప్రాంతంలో గడచిన 17 నెలల్లో 45 కేసులు బయటపడటం అధికారులను షాక్ గురిచేస్తోంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొంతమంది అనారోగ్యానికి గురి కావడంతో వైద్యారోగ్య శాఖ వైద్య శిబిరం నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురికి టెస్ట్ చేసింది. వారిలో 19 మందికి హెచ్ఐవి సోకినట్టు తేలింది. అలా హెచ్ఐవి సోకిన వారిలో చాలామంది వివాహం అయిన వారే ఉన్నారు. అయితే ఆ అమ్మాయి ద్వారా వీరందరికీ హెచ్ఐవి సోకినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఆమె కూడా హెచ్ఐవి ఉందని.. దానిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఆమె మందులు వాడుతోంది. అయితే ఆమెకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటును మానిపించడానికి అధికారులు డి అడిక్షన్ సెంటర్ కి పంపించారు. ప్రస్తుతం ఆ యువతి అందులో చికిత్స పొందుతోంది. ఆమెకు ఉన్న మాదకద్రవ్యాల అలవాటును చూపించి చాలామంది లోబర్చుకున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దారుణంగా మారుతుందని భావించి అధికారులు ఆ చర్యలు తీసుకున్నారు. కాగా, విచ్చలవిడి లైంగిక సంబంధాల వల్ల జరిగే అనర్ధాల గురించి రాంనగర్ ప్రాంతంలో వైద్యశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు.