Puri Jagannadh: టాలీవుడ్ లో ఊర మాస్ డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్..ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమాకి హీరోయిజమ్ విషయంలో సరికొత్త కోణాన్ని పరిచయం చేసి సంచలనం సృష్టించిన దర్శకుడు ఆయన..ఆరోజుల్లో తన మొదటి సినిమా బద్రి తోనే ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు..పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన ఈ చిత్రం అప్పట్లో హీరోయిజమ్ విషయంలో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది.

ఈ సినిమా తర్వాత ఆయన ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి , దేశముదురు ఇలా ఒక్కటా రెండా, టాలీవుడ్ లో ఎన్నో సంచలనాత్మక బ్లాక్ బస్టర్స్ తో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజి ఏర్పాటు చేసుకున్నాడు..ఆ తర్వాత కొన్ని చెత్త సినిమాలు తీసినప్పటికి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయ్యాడు..ఈ సినిమా పూరీజగన్నాథ్ కి దర్శకుడిగా మరియు నిర్మాతగా మంచి బూస్ట్ ని ఇచ్చింది.
అయితే ఆ తర్వాత ఆయన విజయ్ దేవరకొండ తో కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన లైగర్ చిత్రం దారుణమైన పరాజయం పాలైంది..నిర్మాతగా పూరి జగన్నాథ్ కి చావుదెబ్బ ఈ సినిమా..అయితే ఎంత దరిద్రంగా పరిస్థితి ఎదురైనా ఢీ కొట్టే సత్తా పూరీ జగన్నాథ్ కి ఉంది..అందుకే ఈ ఫ్లాప్ నుండి కూడా ఆయన తొందరగా తేరుకొని తదుపరి చిత్రం పై దృష్టి సారించాడు..అయితే పూరీ జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అనే పోడ్ క్యాస్ట్ ఛానల్ ని చాలా కాలం నుండి నడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ పోడ్ క్యాస్ట్ ద్వారా పూరీ జగన్నాథ్ తనకి వచ్చిన ఐడియాస్ ని షేర్ చేసుకుంటూ ఉంటాడు..ఈ సందర్భంగా నిన్న ఆయన పెట్టిన ఒక పోడ్ క్యాస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘మన లైఫ్ లో జరిగేవాటిపై మనకి కంట్రోల్ ఉండదు..కేవలం జరిగే సంఘటనలపై మన రియాక్షన్స్ మాత్రమే మన కంట్రోల్ లో ఉంటాయి..విపరీతమైన కోపం వచ్చినప్పుడు అసలు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడమే ఉత్తమం..ఇడియట్ మూవీ షూటింగ్ సమయం లో ఏడ్చే సన్నివేశంలో హీరోయిన్ రక్షిత సరిగా చెయ్యడం లేదు..మధ్యలో నవ్వుతూ ఉండేది..ఆమె అలా చెయ్యడంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది..ఆ సమయంలో నేను రక్షిత నువ్వు అసలు సీన్ పై ఫోకస్ చెయ్యడం లేదు..ఇలాగే చేస్తే కష్టం..నా తదుపరి సినిమాలో నీకు క్యారక్టర్ రాయను అని అన్నాను..ఆ సమయంలో రక్షిత నాకు క్యారక్టర్ రాయకపోతే నిన్ను చంపేస్తా జాగ్రత్త.. నీ తర్వాతి పది సినిమాలలో కూడా నేనే హీరోయిన్ గా ఉండాలి..ఏమి జరిగిందో చెప్పు చావు అని ఆమె కామెంట్ చేసింది..రక్షిత అలా మాట్లాడడంతో నాకు నవ్వు ఆగలేదు..రక్షిత నుండి అలాంటి రియాక్షన్ రావడంతో అప్పటి వరకు నాకు ఉన్న కోపం మొత్తం పోయింది’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.