https://oktelugu.com/

వీసా కోసం పెళ్లి చేసుకున్నానంటున్న స్టార్ హీరోయిన్…?

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గతంలో అనేక సందర్బాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను వీసా కోసమే పెళ్లి చేసుకున్నాంటూ వ్యాఖ్యలు చేసి రాధికా ఆప్టే వార్తల్లో నిలిచింది. తెలుగులో ఈమె రక్తచరిత్ర, లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది. రాధికా ఆప్టే నటించిన సినిమాల్లో లెజెండ్ మినహా మరే సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. సాధారణంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 25, 2020 / 10:33 AM IST
    Follow us on


    బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే గతంలో అనేక సందర్బాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాను వీసా కోసమే పెళ్లి చేసుకున్నాంటూ వ్యాఖ్యలు చేసి రాధికా ఆప్టే వార్తల్లో నిలిచింది. తెలుగులో ఈమె రక్తచరిత్ర, లయన్, లెజెండ్ సినిమాల్లో నటించింది. రాధికా ఆప్టే నటించిన సినిమాల్లో లెజెండ్ మినహా మరే సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి.

    సాధారణంగా నిజంగా వీసా కోసమే పెళ్లి చేసుకున్నా ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవరూ ఇష్టపడరు. అయితే రాధికా మాత్రం ఓపెన్ గా ఈ వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. బ్రిటిష్‌ మ్యుజిషియన్‌ బెనెడిక్ట్ టేలర్‌ ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది. 2012లో రాధికా ఆప్టే వివాహం జరిగింది. అయితే పెళ్లి తరువాత ఈమె వరుస అవకాశాలతో హీరోయిన్ గా బిజీ కావడం గమనార్హం. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఈమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది.

    అందం, అభినయం ఉన్న నటి కావడంతో పాటు బోల్డ్ పాత్రల్లో కూడా నటించి రాధిక గుర్తింపు సంపాదించుకుంది. ఇంటర్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ తన వరకు లైఫ్ కు బోర్డర్స్ లేవని.. తాను పెళ్లిని నమ్మే వ్యక్తిని కానని.. వీసా కోసం మాత్రమే తాను పెళ్లి చేసుకున్నానని.. తనకు పెళ్లిపై పెద్దగా నమ్మకం లేదని.. అందులోనూ భర్తతో కలిసి జీవించాలని ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకున్నానని ఆమె వెల్లడించారు.

    ప్రస్తుతం లండన్ లో ఉన్న రాధికా ఆప్టే లాక్ డౌన్ సమయంలో మంచి ఆహారం తీసుకున్నానని.. వ్యాయామాలు చేసి తనను తాను ఫిట్ గా మార్చుకున్నానని.. సినిమాలు చూడటంతో పాటు కొన్ని కథలు రాశానని ఆమె వెల్లడించారు.