Tom Cruise: చిన్న చిన్న ఫైట్స్ చెయ్యడానికే డూప్స్ ని పెట్టి లాగించేస్తున్న రోజులివి..హీరోలు కాస్త రిస్క్ అనిపించినా కూడా చెయ్యడానికి ధైర్యం చూపరు..ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఎవరో ఒకరిద్దరు హీరోలు తప్పిస్తే మిగిలిన హీరోలందరూ ఫైట్స్ కి డూప్స్ ని పెట్టుకోడానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు..అలాంటి హీరోలు ఉన్న ఈరోజుల్లో ‘సాహసమే నా శ్వాస’ అనే రేంజ్ లో కెరీర్ ప్రారంభం నుండి నేటి వరుకు సాహసాలతోనే తన జీవితం గడిపేస్తున్నాడు ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ‘టామ్ క్రూజ్’.

ఈయన చేసే యాక్షన్ ఫిల్మ్స్ చూస్తే అసలు ఇతను నిజంగా మనిషేనా అనే సందేహం రాక తప్పదు..అలాంటి సాహసాలు చేస్తాడు ఆయన..పోనీ అతను ఏమైనా కుర్ర వయస్సులో ఉన్నాడా అంటే అదీ లేదు.. ఆయనకి ప్రస్తుతం ఉన్న వయస్సు 60 ఏళ్ళు..అరవై ఏళ్ళ వయస్సు లో కూడా ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు ప్రపంచం లో ఈయన తప్ప ఎవ్వరు చెయ్యలేరు.
ఈ ఏడాది ఆయన హీరో గా నటించిన ‘టాప్ గన్ మెవరిక్’ చిత్రం ప్రభంజనం సృష్టించింది..ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది..ఈ చిత్రం తర్వాత ఆయన ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే సినిమాని చేస్తున్నాడు..ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వీడియో ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసాడు..9 నిమిషాల పాటు ఉండే ఆ వీడియో చూస్తే మనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి.

విమానం నుండి దూకేయడం..బైక్ రైడింగ్ చేస్తూ కొండల మీద నుండి దూకేయడం ఇలా ఒక్కటా రెండా అతను చేసిన నిజమైన సాహసాలు చూస్తే ఇతను అసలు మనిషి కాదు మనకి కచ్చితంగా అనిపిస్తాది..ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి..ఈ వీడియో ని నిన్న రాత్రి అప్లోడ్ చెయ్యగా 60 వేలకు పైగా రీట్వీట్లు మరియు రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
So excited to share what we’ve been working on. #MissionImpossible pic.twitter.com/rIyiLzQdMG
— Tom Cruise (@TomCruise) December 19, 2022