Anchor Pradeep Marriage: ప్రదీప్ కి పెళ్లీడు దాటి చాలా కాలమే అవుతుంది. 36 ఏళ్ల ఈ బుల్లితెర స్టార్ పెళ్లి మాట ఎత్తడం లేదు. పలు మార్లు ప్రదీప్ కి వివాహం అంటూ ప్రచారం జరిగింది. అలాగే ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. వాటిని ప్రదీప్ తనదైన శైలిలో ఖండించారు. ప్రదీప్ కొన్ని లైంగిక ఆరోపణలు కూడా ఎదుర్కోవడం కొసమెరుపు. అయితే అవి నిరాధారమైనవనిగా తేలాయి. బుల్లితెరపై మేల్ యాంకర్స్ హవా పెద్దగా ఉండేది కాదు. యాంకరింగ్ రంగంలో అమ్మాయిలదే డామినేషన్. ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొట్టి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు ప్రదీప్.

సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్ళు ఎదిగే వరకు ప్రదీప్ కి అడ్డులేదు. యాంకర్ గా వచ్చిన ఫేమ్ తో ప్రదీప్ హీరో కూడా అయ్యారు. ఆయన హీరోగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీ విడుదలైంది. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. అంతకు ముందు జులాయి, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రదీప్ హీరోగా ట్రై చేసి నెమ్మదించాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనంతరం మరో చిత్ర ప్రకటన చేయలేదు.
యాంకర్ గా ప్రదీప్ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు. కొత్తగా ఓటీటీ షోలు కూడా యాడ్ అయ్యాయి. దీంతో ఆయన మరింత బిజీ అయ్యే సూచనలు కలవు. కాగా ప్రదీప్ వివాహం చేసుకుంటున్నారంటూ విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆయన ప్రేమ వివాహం చేసుకుంటున్నారట. ఫ్యాషన్ డిజైనర్ అయిన నవ్య మారోతు అనే అమ్మాయిని చాలా కాలంగా ప్రదీప్ ప్రేమిస్తున్నారట. ఆమెతోనే ఏడడుగులు నడవనున్నాడట. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకోవడం జరిగిందట. వీరి మతాలు వేరైనప్పటికీ ఇరు కుటుంబాల మధ్య ఎప్పటి నుండో స్నేహం ఉన్న నేపథ్యంలో పెళ్లి సంబంధం కుదిరిందట.

త్వరలో ప్రదీప్ పెళ్ళిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. గతంలో ప్రదీప్ తన వివాహాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అని అడగ్గా… నేను లవ్ అండ్ అరేంజ్డ్ చేసుకుంటాను. ప్రేమించినప్పటికీ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటానని చెప్పారు. ఇక యూట్యూబ్ లో ఇప్పటికే నాకు పలు మార్లు వివాహం చేశారని ఆయన సెటైర్లు వేశారు. మరి ఈసారైనా ప్రదీప్ పెళ్లి వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే… కొన్ని రోజులు ఆగాలి.