Ramya Krishnan: హీరోయిన్ కావడం చిన్న విషయం కాదు. టాలెంట్ కి మించి మానసికంగా దృఢంగా ఉండాలి. సవాళ్ళను ఎదుర్కోవాలి. లైంగిక వేధింపులు హీరోయిన్ కావాలనుకునే అమ్మాయికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య. ఆఫర్ కోసం వెళితే పక్కలోకి వస్తావా అని అడిగేవాళ్ళు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకూ ఉంటారు. ఇప్పుడు టాప్ స్టార్స్ గా ఎదిగిన హీరోయిన్స్ అందరూ ఏదో ఒక దశలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే. ఈ జనరేషన్ అమ్మాయిలకు ఎంతో కొంత అవగాహన ఉంది. తమ గోడు చెప్పుకోవడానికి మీడియా, సోషల్ మీడియా వంటి బలమైన ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి.
రెండు మూడు దశాబ్దాల క్రితం అవేమీ లేవు. సామాన్యుల గోడు నాలుగు గోడల మధ్య సమాధి అయిపోయేది. ఇలాంటి లైంగిక వేధింపులు చూసిన హీరోయిన్స్ లో రమ్యకృష్ణ ఒకరు. టాప్ స్టార్ గా దశాబ్దాల పాటు పరిశ్రమను ఏలిన రమ్యకృష్ణ కెరీర్ బిగినింగ్ లో ఓ స్టార్ దర్శకుడి వేధింపులకు గురయ్యారట. సదరు డైరెక్టర్ ఆఫర్ ఇస్తానని చెప్పి ఆమెకు అస్లీల వీడియోలు చూపించాడట. అలా చేస్తే నిన్ను టాప్ హీరోయిన్ చేస్తా అని అసభ్యకరంగా ప్రవర్తించాడట.
రమ్యకృష్ణ కోపంగా అక్కడ నుండి వచ్చేశారట. ఆ డైరెక్టర్ మీద విపరీతమైన కోపం వచ్చినప్పటికీ బయటకు చెప్పుకోలేకపోయారట. టాప్ పొజిషన్ లో ఉన్న ఆ డైరెక్టర్ గురించి కామెంట్స్ చేస్తే… తనకు కెరీర్ లేకుండా పోతుందని రమ్యకృష్ణ భయపడ్డారట. అయితే ఆ దర్శకుడు రమ్యకృష్ణను వేధించాడని పరిశ్రమలో అందరికీ తెలుసట. అయితే ఎవరూ నోరు మెదిపే పరిస్థితి లేదట.
దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. చివరి రోజుల్లో ఆ డైరెక్టర్ దుర్భరమైన చావు చచ్చాడట. అయినవాళ్ళు కనీసం పట్టించుకోలేదట. చేసిన పాపాలకు ఆ డైరెక్టర్ అనుభవించాడని పరిశ్రమలో చెప్పుకున్నారట. ఈ మేరకు పరిశ్రమలో ఆ డైరెక్టర్ మీద ఓ వాదన ఉంది. కేవలం టాలెంట్ ని నమ్ముకున్న రమ్యకృష్ణ ఉన్నత స్థాయికి చేరారు. విలక్షణ పాత్రలతో గొప్ప నటి అనిపించుకున్నారు. నరసింహ మూవీలో రజినీకాంత్ ని కూడా డామినేట్ చేసిన రమ్యకృష్ణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇటీవల రంగమార్తాండ మూవీతో ఆమె ప్రేక్షకులను పలకరించారు.