Shuttlecock: భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చిన్నప్పుడు చదవుకున్నాం. దీంతో ఏదైనా పైకి విసిరితే మళ్లీ కింద పడుతుందని తెలుసుకున్నాం. ఏదైనా మీదికి వెళితే కింద పడాల్సిందే. కానీ ఓ షటిల్ కాక్ కొద్ది నిమిషాల పాటు ఆకాశంలోనే ఉండిపోవడంతో అందరు వింతగా చూశారు. ఈ విచిత్ర ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై పలు రకాల కామెంట్లు వచ్చాయి. కొందరు అద్భుతంగా చెబుతున్నా మరికొంరు అదంతా వట్టిదేనని కొట్టి పారేస్తున్నారు. ఏదో సోషల్ మీడియాలో ప్రచారం కోసం ఇలా చేశారనే వాదనలు సైతం వచ్చాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా సవరం మండలం టేకులబోరు బీసీ కాలనీలో చిన్నారులు బుధవారం సాయంత్రం షటిల్ ఆడుతున్నారు. దీంతో మధ్యలో ఒక్కసారిగా కాక్ పైకి కొట్టగానే గాల్లో అలాగే ఉండిపోయింది. దీంతో ఆటాడే వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఘటనను ఫోన్ లో చిత్రీకరించారు. ఆకాశంలో కాక్ అలా ఎలా ఉండిపోయిందని అనుకున్నారు. వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ఇదెలా సాధ్యమని అందరు ప్రశ్నిస్తున్నారు. పైకి లేచిన కాక్ కింద ఎందుకు పడలేదని అలాగే చూశారు.
ఆకాశంలో జరిగిన అద్భుతంతో అందరు కొంత ఆశ్చర్యపోయినా అలా జరగడంపై అందరు వింతగా చూశారు. షటిల్ కాక్ మధ్యలోనే ఆగిపోవడం వింతగా ఉన్నా ఎలా సాధ్యమైందనే దానిపై ఆలోచిస్తున్నారు. ఏ వస్తువైనా కిందకు జారాలే కానీ అలాగే ఉండిపోవడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కాక్ కదలకుండా ఉండిపోవడంతో అక్కడున్న వారంతా ప్రత్యక్షంగా చూశారు. కొంతమంది నోరెళ్లబెట్టి మరీ కాక్ ను పరిశీలించారు. కొద్ది నిమిషాలు అలాగే ఉన్నా తరువాత కిందకు పడింది.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల కామెంట్లు వచ్చాయి. కాక్ ఆగిపోవడం ఓ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. కొందరు కావాలనే ఇలా చేశారని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో సంచలనాల కోసం ఇలాంటివి చేయడం కామనే అని ట్వీట్ చేయడం గమనార్హం. కేవలం వైరల్ చేసేందుకే వీడియోను ప్రమోట్ చేశారని చెబుతున్నారు. వండర్ క్రియేట్ చేసేందుకు ఇలాంటి వీడియోలు ప్రస్తుతం మామూలుగా మారింది. కరెంటు తీగకు సాలెపురుగు గూడు పెట్టడంతో కాక్ అక్కడ చిక్కుకుందని కొందరు సెటైర్లు వేస్తున్నారు.