Aditya 369 Sequel: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయిన చిత్రాలలో ఒకటి ‘ఆదిత్య 369’..సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వస్తే టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతాయి..నాలుగు పాటలు నాలుగు ఫైట్లు రెండు ఎమోషన్ సన్నివేశాలు అన్నట్టుగా ఒక మూసలో నడుస్తున్న తెలుగు కమర్షియల్ సినిమాని కొత్త పుంతలు తొక్కించేలా చేసిన సినిమా ఇది.

టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనేది నా కల అని బాలయ్య బాబు అనేక సందర్భాలలో తెలిపాడు కూడా..ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించడమే కాకుండా,దర్శకత్వం కూడా వహిస్తానని బాలయ్య బాబు మరోసారి అధికారికంగా ఖారారు చేసాడు..నిన్న ఆయన విశ్వక్ సేన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ధమ్ కీ’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరయ్యాడు.

విశ్వక్ సేన్ హీరో గా నటిస్తూ దర్శకత్వం మరియు నిర్మాత బాధ్యతలను కూడా ఈ సినిమా కి చేపట్టాడు..ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరైన బాలయ్య బాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘ చిన్న వయస్సులోనే విశ్వక్ సేన్ హీరో గా, దర్శకుడిగా మరియు నిర్మాతగా పని చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..నేను కూడా త్వరలోనే నా స్వీయ దర్శకత్వం లో ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 ని తెరకెక్కించబోతున్నాను..వచ్చే ఏడాది లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది..ఇక ‘ధమ్ కీ’ ట్రైలర్ ని చూసాను..చాలా అద్భుతంగా ఉంది..ఈ సినిమా మంచి విజయం సాధించి తమ్ముడు విశ్వక్ సేన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అంటూ బాలయ్య బాబు ఈ సందర్భంగా మాట్లాడారు.