
RRR Re-Release Collection: ప్రస్తుత ప్రపంచం మొత్తం మారుమోగిపోతున్న పేరు #RRR..దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర అద్భుతం గత ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది.థియేట్రికల్ పరంగా ఆ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా, డిజిటల్ మీడియా లోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చుకుంది.
మరో రెండు రోజుల్లో ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకోబోతున్న ఈ సినిమాని మరోసారి ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఈ చిత్రం గ్రాండ్ గా రీ రిలీజ్ అయ్యింది.కానీ అమెరికా లో మాత్రం వారం రోజుల ముందే రీ రిలీజ్ అయ్యింది.అక్కడ ఈ చిత్రం రీ రిలీజ్ లోను సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.వారం రోజులకు గాను ఈ చిత్రం అక్కడ రెండు లక్షల డాలర్లను సాధించింది.
కానీ మన తెలుగు స్టేట్స్ లో మాత్రం ఈ సినిమా నేడు కనీస స్థాయి ఓపెనింగ్ ని కూడా సొంతం చేసుకోలేకపోయింది.అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కనీసం వెయ్యి టికెట్స్ కూడా అమ్ముడుపోని ఈ సినిమా కి ఓపెనింగ్స్ అతి దారుణంగా వచ్చాయి.అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయని అంచనా.

మొన్న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ కంటే తక్కువ వసూళ్ళుగా దీనిని పరిగణించొచ్చు.అంతార్జాతియ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ఈ సినిమా క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు బయ్యర్స్ వేసిన ప్లాన్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎగబడి చూసేయడం వల్లే మరోసారి చూసేందుకు జనాలు ఆసక్తి చూపలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.