
Viveka Murder Case- Avinash Reddy: వివేకా హత్య కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వరుసగా సీబీఐ ఎదుట మూడోసారి హాజరయ్యారు. ఆయన అరెస్టు తప్పదని అందరూ భావించారు. ఈ విషయంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మూడోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఒకపక్క సీబీఐ విచారణ జరుగుతుండగానే, తెలంగాణ హై కోర్టును ఆయన ఆశ్రయించారు. సెక్షన్ 60 ప్రకారం తనకు నోటీసులిచ్చి విచారణ చేస్తున్నందున అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. లాయర్ ను కూడా అనుమతి ఇవ్వడం లేదని, ఆడియో, వీడియో రికార్డులు కూడా జరపడం లేదని వాదించారు.
కాగా, తనను అరెస్టు చేయకుండా అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ లో పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు. వివేకా తనయురాలు సునీత తన పేరు కూడా చేర్చారు. దీంతో ఆమె తనను కూడా సదరు పిటీషన్‌లో ఇంప్లీడ్ చేయాలంటూ ఆమె హై కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె వాదనలను కూడా హై కోర్టు వినేందుకు సిద్ధమవుతుంది. అలాగే, వివేకా కేసులో అసలు దోషి అల్లుడేనని అవినాష్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, సీబీఐ అధికారులు తన వాంగ్మూలాన్ని ఎడిట్ చేశారంటూ ఆరోపణలు చేస్తూ కోర్టుకు నివేదించారు.

ఇంకా వివేక హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాల్లేవని, కేవలం ఒక వర్గం, మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా తనపై విచారణ జరుగుతుందని వివరించారు. అవినాశ్ రెడ్డి వాదనలను విన్న తెలంగాణ హై కోర్టు సీబీఐ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది. కోర్టుకు మరిన్ని సాక్ష్యాలను ఇవ్వాల్సి ఉన్నందున్న అరెస్టును నిలుపుదల చేయాలని పేర్కొంది.