Prabhas: అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్యాన్స్ తో పాటు సగటు మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు ఆహా నిర్వాహకులు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యారు. ప్రభాస్-బాలయ్య ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబర్స్ పోటెత్తారు. ఆహా యాప్ లో లక్షల్లో లాగిన్ కావడంతో దెబ్బకు జామ్ అయ్యింది. ఆహా యాప్ మొత్తంగా షట్ డౌన్ అయ్యింది. ఆహా యాజమాన్యం దీనిపై అధికారిక ప్రకటన చేసింది. ఆహా ప్రసారాలు నిలిచిపోయాయి. టీమ్ పునరుద్ధరిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఎప్పుడో అర్ధరాత్రికి ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యింది.

అన్ స్టాపబుల్ షోలో హోస్ట్ బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి మేటర్ బయటకు లాగుతారని అందరూ నమ్మారు. ఆడియన్స్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాలకృష్ణ చాలా వరకు ఆ కోణంలో ప్రభాస్ మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేశారు. సిల్వర్ స్క్రీన్ పై చాలా మంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేశావు… అయితే ఆఫ్ స్క్రీన్ లో ఎవరితో రొమాన్స్ చేశావు? అని బాలయ్య అడిగారు. సినిమాల్లో కాకుండా బయట రొమాన్స్ ఎవరితో చేశావో చెప్పాలని, బాలకృష్ణ ఇరుకున పెట్టారు.
ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో తెలియక ప్రభాస్ ఇబ్బంది పడ్డారు. మీ వాళ్ళు నాకు ఏదో టాబ్లెట్ ఇచ్చారు సర్, మర్చిపోయాను అని ప్రభాస్ సమాధానం చెప్పాడు. అలా తప్పించుకోవద్దు సమాధానం చెప్పాల్సిందే అని బాలయ్య పట్టుబట్టాడు. ఎవరితో రొమాన్స్ జరగలేదు సర్, జరిగితే పెళ్ళైపోయేదని ప్రభాస్ మరొక సమాధానంగా చెప్పారు. పెళ్లి కాలేదు కాబట్టే రొమాన్స్ చేసి ఉంటావని, బాలయ్య ప్రభాస్ తో అన్నారు.

అది కొంచెం బోల్డ్ క్వశ్చన్ కావడంతో బాలయ్య వదిలేశాడు. సమాధానం చెప్పకపోయినా మరో ప్రశ్నకు వెళ్లారు. కాగా రామ్ చరణ్ కి కాల్ చేసిన బాలకృష్ణ… ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్ షేర్ చేయాలని అడిగారు. త్వరలో ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చరణ్ అన్నారు. ఈ హింట్ చాలు నేను అల్లుకుపోతా అన్న బాలకృష్ణ… అమ్మాయి ఎవరు రాజునా, రెడ్డినా, చౌదరినా? నాయుడునా? సనన్ నా? లేక శెట్టినా?… హింట్ ఇవ్వాలని చరణ్ ని అడిగారు. అదేమీ చెప్పలేను కానీ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాడు, అని చరణ్ వెల్లడించారు. చరణ్ నువ్వు నన్ను ఇరికించేశావని ప్రభాస్ ఆందోళన చెందాడు.