Krishna- Jaggaiah: అది 1960. కృష్ణ డిగ్రీ పూర్తి చేశారు. సినిమాల పై ఇష్టంతో మద్రాస్ వెళ్లారు. తెనాలి ప్రాంతానికి చెందిన జగ్గయ్య, గుమ్మడి, చక్ర పాణిని కలిశారు. వయసు తక్కువగా ఉందని కొంత కాలం ఆగాక రా అని వారు చెప్పారు. నిరాశగా కృష్ణ వెనుదిరిగారు. కానీ అప్పట్లో జగ్గయ్య నేతృత్వం లో ” పదండి ముందుకు” అనే సినిమా రూపొందుతోంది. మద్రాస్ వెళ్లి వచ్చిన కృష్ణ ప్రజా నాట్య మండలి లో నాటకాలు వేస్తున్నారు. అయితే “పదండి ముందుకు” సినిమాలో నటించేందుకు నటీనటులు కావాలని జగ్గయ్య ఒక పత్రికలో ప్రకటన ఇచ్చారు. దీనిని చూసిన కృష్ణ తన ఫోటోను పంపించారు. దీంతో జగ్గయ్య ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమాలో నటించిన అనుభవం కృష్ణకు తేనె మనసులు కు ఎంతో ఉపకరించింది. అయితే కృష్ణ అందంగా ఉండడం, దానికి తగ్గట్టే ఎత్తు ఉండడంతో శ్రీధర్ అనే దర్శకుడి కంట్లో పడ్డాడు. ఒక తమిళ సినిమా ద్వారా కృష్ణ ను పరిచయం చేద్దామని అనుకున్నాడు. అతని పేరు కృష్ణన్ గా మార్చాడు. అయితే కారణాలు తెలియదు గాని ఆ పాత్ర రవిచంద్రన్ అనే నటుడికి వెళ్ళిపోయింది.. ఇక అదే శ్రీధర్ దర్శకత్వంలో 1970లో కృష్ణ “హరే రాధ హలో కృష్ణ” అనే సినిమా తీశారు.

ఆదుర్తి సుబ్బారావు పిలిచి అవకాశం ఇచ్చారు
“పదండి ముందుకు” అనే సినిమాలో చిన్న పాత్ర వేసిన తర్వాత కృష్ణ నటన తీరు చూసి ఆదుర్తి సుబ్బారావు తేనెమనసులు సినిమాలో అవకాశం ఇచ్చారు. మరో హీరోతో తెరపంచుకోవలసి వచ్చినప్పటికి కృష్ణ ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. “పదండి ముందుకు” సినిమాలో నటిస్తున్నప్పుడు కృష్ణ ప్రతిభను జగ్గయ్య గుర్తించారు. తేనె మనసులు సినిమా తో సుబ్బారావు మరింత సానపెట్టారు. కన్నె మనసులు, గూడచారి 116 తర్వాత కృష్ణ మరిన్ని ప్రయోగాలు చేశారు. కుల గోత్రాలు, పరువు ప్రతిష్టవంటి సినిమాల్లోనూ కృష్ణ కనిపించారు. ఆదే సమయంలో విఖ్యాత దర్శకుడు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కొడుకు కోడళ్ళు అనే సినిమాలో కృష్ణకు అవకాశం వచ్చింది. కారణాలు తెలియదు గానీ మరో నాలుగు రోజుల్లో షూటింగ్ అనగా ఆగిపోయింది.
ఎన్టీఆర్ తేలిపోయారు
1968లో కృష్ణ నటించిన అసాధ్యుడు, విజయ బ్యానర్ లో ఎన్టీఆర్ నటించిన ఉమా చండీ గౌరీ శంకరుల కథ అనే సినిమాలు సంక్రాంతికి ఒకేసారి విడుదలయ్యాయి. ఆ సమయంలో చాలామంది ఎన్టీఆర్ మీద కృష్ణ ఆనుతాడా అని గేలి చేశారు. కానీ ఎన్టీఆర్ సినిమా ప్లాప్ అయింది.. అసాధ్యుడు సూపర్ హిట్ గా నిలిచింది. తర్వాత విజయ బ్యానర్ లో చక్రపాణి చేతుల మీదుగా రూపొందిన రెండు సినిమాలు గంగ మంగ, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ లో కృష్ణ నటించారు.

కేవలం హీరోగా మాత్రమే కాకుండా విశ్వనాధ్ అనే దర్శకుడు తీసిన ప్రైవేటు మాస్టర్ సినిమాలో కృష్ణ విలన్ గా చేశారు. పాప కోసం అనే సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించారు.. బాపు తీసిన ఏది ధర్మం ఏది న్యాయం అనే సినిమాలో ఐదు నిమిషాలు నిడివి ఉన్న కోర్టు సీన్ లో కృష్ణ నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. శ్వాస తుదివరకు సినిమా కోసం పరితపించిన కృష్ణ.. నేడు గుండె పోటు తో తుది శ్వాస తీసుకోవడంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.