Golden Deer: రామాయణంలో సీతమ్మ తల్లిని తప్పుదోవ పట్టించేందుకు రావణుడి ఆదేశంతో మారీచుడు బంగారు లేడీ అవతారం ఎత్తుతాడు. ఆ బంగారు లేడిని కావాలని సీతాకోరడం, దానికోసం రాముడు బయలుదేరడం, చివరికి బాణం సంధించి దానిని చంపడం.. ఆ తర్వాత రావణుడు రావడం.. సీతను ఎత్తుకెళ్లడం వంటి పరిణామాలు జరుగుతాయి. వాస్తవానికి అలాంటి బంగారు వర్ణంలో ఉన్న జింక ఉందా? రామాయణంలో మారీచుడు బంగారు వర్ణంలో ఉన్న జింకలాగా మాయ అవతారం ఎత్తుతాడు కాబట్టి.. బంగారు వర్ణంలో ఉన్న జింక అనేది అబద్ధమని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు. కానీ అలాంటి బంగారు వర్ణంలో ఉన్న జింక ఈ భూమ్మీద ఉందని తెలిసింది.
సుశాంత నంద అనే (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో బంగారు వర్ణంలో ఉన్న జింక ఫోటోను పోస్ట్ చేశారు. “రామాయణంలో నిజమైన బంగారు జింక ఇదిగో. శరీరం మొత్తం బంగారు వర్ణం.. దానిపైన తెల్లటి మచ్చలు.. ఎరుపు, గోధుమ వర్ణం మిళితమైన తలభాగం.. దాని కింద తెల్లటి వెంట్రుకలు.. చూడ్డానికి ఇది రామాయణంలో బంగారు వర్ణపు జింకలాగా ఉంది. ఒడిశాలోని అడవుల్లో ఇది కనిపించింది. ఇది అత్యంత అరుదైన జింక.. మచ్చలతో కనువిందు చేస్తోంది” అంటూ ట్విట్టర్ ఎక్స్ లో ఆ అధికారి రాస్కొచ్చారు. మనదేశంలో సాంబార్ జింకలు, చుక్కల దుప్పులు, మన బోతులు ఎక్కువగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అడవుల్లో చుక్కల దుప్పులు విస్తారంగా కనిపిస్తాయి. కానీ ఇప్పటివరకు బంగారు వర్ణపు జింక కనిపించలేదు.
తొలిసారిగా రామాయణంలో మాదిరి బంగారు జింక ఒడిశా అడవుల్లో అధికారులకు కనిపించింది. అడవుల్లో ఏర్పాటుచేసిన కెమెరాల్లో ఆ జింక చిక్కింది. చూడ్డానికి ఎంతో బలిష్టంగా ఉన్న ఆ జింక.. ఒంటిపై తెల్లని చుక్కలు, బంగారు వర్ణపు చర్మంతో మెరిసిపోతోంది. పగలే ఇంతటి కాంతిని వెదజల్లుతుంటే.. రాత్రి అయితే మరింత మెరిసిపోతుంది కావచ్చు. ఒడిశా ప్రాంతంలో అనువైన పచ్చిక మైదానాలు ఉండటంతో.. ఈ జింక ఇక్కడ పెరుగుతోందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. అయితే అలాంటి జింకలు ఇంకా ఉన్నాయా? లేకుంటే జింకల్లో జన్యుపరమైన మార్పుల వల్ల ఇది పుట్టిందా? అనే దిశగా అటవీశాఖ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. కాగా, బంగారు వర్ణపు జింకల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంటున్నారు.” ఇవి చలాకీగా ఉంటాయి. ఏమాత్రం అలసిపోవు. అడవుల్లో ప్రత్యేకమైన గడ్డిని మాత్రమే తింటాయి. వీటి ఆవాసాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. పులి, సింహం వంటి క్రూర జంతువులు ఈ జింకల మాంసాన్ని తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఇవి అడవుల్లో అత్యంత ప్రత్యేకంగా ఉంటాయని” అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
Here is the real ‘golden deer’ of the Ramayana
Chitals spotted coat is reddish brown above and white below. But here is one wonder from the forests of Odisha. A highly rare leucistic ( partial pigmented) Spotted dear pic.twitter.com/ffVNYQw2KL
— Susanta Nanda (@susantananda3) March 21, 2024