Chhattisgarh Lovers: గురివింద కూడా అందరిని చూసి నవ్వుతుందట. తాను నల్లగా ఉన్నాననే విషయం మరిచిపోతుందట. నాగరికత ముసుగులో నైతికత మరిచిపోతున్నారు. నాలుగు గోడల మధ్య చేసుకునే శృంగారం నడిరోడ్డులోనే చేస్తున్నారు. దీంతో అందరు అవాక్కవుతున్నారు. హవ్వ ఇదేం చోద్యం అని నోరెళ్లబెడుతున్నారు. అయినా సరే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా కూర్చుని ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. దీంతో చూసే వారు ఇదెక్కడి ప్రేమరా బాబూ అంటూ నిట్టూరుస్తున్నారు. ఇంకా ఎవరైనా నేర్చుకుని అదే తీరుగా ప్రవర్తిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విశాఖపట్నంలో ఇదే తీరుగా ఓ జంట బైక్ పై ముద్దుల వర్షం కురిపిస్తూ వెళ్లిన ఘటన మరిచిపోకముందే చత్తీస్ గడ్ లో కూడా ఓ జంట ఇదే విధంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. దీన్నివీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. దీనిపై పోలీసులు సీరియస్ అయ్యారు. వారిని అరెస్టు చేశారు. పబ్లిక్ లో న్యూసెన్స్ చేసినందుకు వారిపై కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి అందరికి ఇబ్బందులు కలిగించినందుకు వారిపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా కనిపించాయి. మనుషుల్లో పరివర్తన మారుతోంది. మనుషులు కూడా జంతువుల మాదిరి మారిపోతున్నారు. నడిరోడ్డునే శృంగార గదిగా భావించుకుంటున్నారు. జనం ఉన్నారనే ఇంగితం లేకుండా రెచ్చిపోతున్నారు. బైక్ మీదే ముద్దుల వర్షం కురిపించుకుంటున్నారు. అంటే వారికే శృంగార స్వేచ్ఛ ఉందా? ఇంకా ఎవరికి లేదా? మనుషులంటే కాస్తయినా ఆలోచన ఉండాలి. మానవ నాగరికత ఇంత దారుణానికి పడిపోతే ఇక విలువలు ఎలా సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి.

రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మనుషుల నడవడికలో విచిత్రమైన పోకడలు కనిపిస్తున్నాయి. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్లుగా మనుషుల్లో జంతు సంస్కృతి పెరిగిపోతోంది. ఫలితంగానే నడిరోడ్డుపై రెచ్చిపోతూ ముద్దులు పెట్టుకోవడం దేనికి సంకేతం. పెరుగుతున్నఆలోచనకా? లేక నశిస్తున్న మానవ సంబంధాలకా అనే సందేహాలు వస్తున్నాయి. దీనిపై చట్టం కూడా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిందే. మన దేశంలో కఠినమైన చట్టాలు లేకపోవడంతోనే ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు ప్రవర్తిస్తున్నారు. దీనికి చరమగీతం పాడాల్సిందే.